Take a fresh look at your lifestyle.

నాకు రిటైర్మెంట్ 61ఏండ్ల పెంపు వద్దు

  • ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకోవాలి: ఏనుగు మల్లారెడ్డి
  • ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్
  • నల్ల బాడ్జీ తో నిరసన తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగి

నాకు రిటైర్మెంట్ 61ఏండ్ల పెంపు వద్దని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్) ఏనుగు మల్లారెడ్డి అన్నారు. కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆయన నల్ల బాడ్జీ ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏనుగు మల్లారెడ్డి మాట్లాడారు. వచ్చే ఏడాది అనగా 2022 మార్చ్ 31 తో తన వయస్సు 58 ఎందుకు పూర్తి అవుతుందన్నారు. పాత పద్దతి ప్రకారం 58ఏండ్ల వయస్సులోనే తాను పదవీ విరమణ చేస్తానన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన కోసం రెండు దశబ్దాలుగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకముగా యువత, విద్యావంతులు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల వీరోచిత పోరాటం, యువకుల బలిదానంతో సబ్బండ వర్గాల సమిష్టి పోరాటాల పలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని ఆయన అన్నారు.

మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
అప్రజాస్వామిక నిర్ణయాలు ఎన్నో తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోమవారం సిఎం కెసిఆర్ ఉద్యోగస్తులకు 61సంవత్సరాల పదవీవిరమణ వయస్సు పెంచడం నాకు చాలా బాధ కలిగించిందని అన్నారు. ఇది నిరుద్యోగ యువకులకు గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. నిరుద్యోగ సమస్యపై ఈ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. నాకు రిటైర్మెంట్ 61 ఏండ్ల పెంపు వద్దు అని ఆయన స్పష్టంచేశారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తనతో కలిసి వచ్చి నిరుద్యోగ యువత కోసం త్యాగం చేయాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా పెరిగి పోతున్న నిరుద్యోగ సమస్య పట్ల ఆలోచించాలని ఆయన సూచించారు.

ఈ ఉద్యోగ విరమణ వయస్సు పెంపుతో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పునరాలోచించి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని, నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏనుగు మల్లారెడ్డి కోరారు. కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత, విద్యార్థులు ప్రక్కదారి పట్టే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు. ఒకవేళ యువత ప్రక్కదారి పడితే దానికి కెసిఆర్, రాష్ట ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా కెసిఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అంతా కూడా పునరాలోచించాలని ఏనుగు మల్లారెడ్డి కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు తనతో కలిసిరావలని పిలుపునిచ్చారు.

Leave a Reply