Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో బిజెపి వోటు అడగాలంటే… పార్లమెంటులో పెట్టిన బోరు బావుల మీటర్ల బిల్లు ఉపసంహరించుకోవాలి

  • దౌల్తాబాద్‌ ‌రైతుల కోసం రామలింగారెడ్డి ఎంతో ఆలోచించారు…
  • దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీష్‌రావు
  • టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు షురూ

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థి ప్రజలను వోట్లు అడగాలంటే ముందుగా పార్లమెంటులో కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోరు బావుల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని హరీష్‌రావు డిమాండు చేశారు. మంగళవారం సిద్ధిపేట జిల్లాలో దౌల్తాబాద్‌ ‌మండ లంలోని మాచిన్‌పల్లిలో రూ.1.60కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజల కోపానికి బీజేపీ గురవుతుందని   మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.- తెలంగాణలోని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నదని మంత్రి హరీష్‌ ‌పేర్కొన్నారు.I

రైతుల బోరు బావులకు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని నరేంద్రమోదీ  ప్రభుత్వం చెబుతున్నదని, దుబ్బాకలో బీజేపీ వోటు అడగాలంటే.. ముందుగా  రైతుల బోరు బావుల మీటర్లకై పార్లమెంటులో పెట్టిన బిల్లు ఉపసంహరణ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సూచన చేశారు. ఢీల్లీలో కేంద్రంలోని బీజేపీ పార్టీ  ప్రభుత్వం వ్యవసాయ  బావుల వద్ద బోరు బావులకు మీటర్లు బిగించాలని అంటుందన్నారు. కానీ,  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతు ప్రభుత్వమంటూ…కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు పెట్టిన బిల్లు ఫలితంగా దుబ్బాక నియోజకవర్గంలోనే 43 వేల 89 బోరు బావుల రైతులకు అన్యాయం జరగనుందని కేంద్ర నిర్ణయం తీరుపై విరుచుకుపడ్డారు.  గత ప్రభుత్వాల హయాంలో కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేదని, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మార్లు కాలిపోవడం, పేలి పోవడం జరిగేవన్నారు. కానీ, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.  రైతుల కోసం రైతుబంధు, రైతు భీమాతో పాటు ఎన్నో  రైతు సంక్షేమ పథకాల కార్యక్రమాలు సిఎం కేసీఆర్‌ ‌చేపట్టారని మంత్రి  హరీష్‌రావు పేర్కొన్నారు.  దౌల్తాబాద్‌ ‌ప్రాంత రైతుల మేలు కోసం దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంతో ఆలోచన చేశారన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాక నియోజకవర్గంలో 20 వేల మంది బీడీ కార్మికులకు బీడీ కార్మిక భృతి ఇస్తున్నామనీ, అదే విధంగా 56 వేల 906 మంది అర్హులకు ఆసరా ఫించన్లు అందిస్తున్నట్లు, అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి రైతులకు, పేదలకు సి•ఎం కేసీఆర్‌ ‌మరింత దగ్గరయ్యారని మంత్రి  హరీష్‌రావు అన్నారు. అనంతరం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ దౌల్తాబాద్‌ ‌మండలంలోని మల్లేశంపల్లి గ్రామంలో రూ.1.10కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, గజ్వేల్‌ ఏఎం‌సి ఛైర్మన్‌ ‌మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, ‌ట్రాన్స్‌కో ఎస్‌ ‌కరుణాకర్‌బాబు, సర్పంచులు యాదయమ్మ, సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నియోజకవర్గస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవాలు షురూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం వచ్చాక గ్రామాలకు కొత్త కళ వచ్చిందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.  ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, ‌వృద్ధాప్య, వితంతు, బీడీ కార్మిక భృతి, వికలాంగులకు ఆసరా పింఛన్ల పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు రూ.1.20 కోట్ల రూపాయల వ్యయంతో శేరిపల్లి బందారం-లింగరాజుపల్లి గ్రామాల మధ్య నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి  హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు నర్సంపేట గ్రామస్తులు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకే తమ మద్దత్తుగా ఏకగ్రీవంగా తెలియజేసి తీర్మానం పత్రాన్ని మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. మంత్రి వెంట జెడ్పీఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ ‌దుబ్బాక, గజ్వేల్‌ ‌నియోజకవర్గ, మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply