Take a fresh look at your lifestyle.

లై డిటెక్టర్‌ ‌పరీక్షలకు నేను సిదం

  • సహారా, ఇఎస్‌ఐ ‌కేసుల్లో కెసిఆర్‌ ‌సిద్దమేనా?
  • సైదాబాద్‌ ‌లాంటి ఘటనలు పురరావృతం కారాదు
  • ట్వీట్లతో హీట్‌ ‌పెంచుతున్న రేవంత్‌
  • ‌రాష్ట్రాన్ని మద్య తెలంగాణగా చేశారని కాంగ్రెస్‌ ‌విమర్శలు
  • గన్‌పార్కు వద్ద  కాంగ్రెస్‌ ‌నేతల వైట్‌ ‌ఛాలెంజ్‌

మంత్రి కేటీఆర్‌, ‌పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డిల మధ్య ట్విట్టర్‌ ‌వార్‌ ‌పొలిటికల్‌ ‌హీట్‌ను పెంచుతుంది. కేటీఆర్‌ ‌లై డిటెక్టర్‌ ‌టెస్టుకు పిలుపునివ్వడంతో రేవంత్‌ ‌స్పందించారు. లైడిటెక్టర్‌ ‌పరీక్షకు సిద్ధంగా ఉన్నానని..తమతో పాటు కేసీఆర్‌ ‌కూడా సహారా, ఈఎస్‌ఐ ‌స్కామ్‌..‌సీబీఐ కేసుల్లో లైడిటెక్టర్‌ ‌టెస్ట్‌లకు వొస్తారా? అని రేవంత్‌ ‌ప్రశ్నించారు. కేటీఆర్‌కు చాలెంజ్‌ ‌విసిరిన నేపథ్యంలోనే రేవంత్‌ ‌గన్‌పార్క్‌కు బయలుదేరారు. మరోవైపు ఇప్పటికే కొండ విశ్వేశ్వర రెడ్డి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. డ్రగ్స్  ‌బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్‌ ‌ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేయగా…తాను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నానని….రేవంత్‌ ‌రెడ్డి వోటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ ‌పరీక్షకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌ ‌తిరిగి ట్వీట్‌ ‌చేశారు. దీనిపై రేవంత్‌ ‌మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు.

మంత్రి కేటీఆర్‌ ‌చెప్పిన విధంగా లై డిటెక్టర్‌ ‌పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమతో పాటు కేసీఆర్‌ ‌కూడా సహారా కుంభకోణం, ఈఎస్‌ఐ ‌కుంభకోణం సీబీఐ కేసులలో లై డిటెక్టర్‌ ‌టెస్ట్‌లకు వొస్తారా అంటూ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ అత్యాచారం, హత్య ఘటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ ‌వంటి వాటితో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ట్వీట్‌ ‌చేశారు. ట్వీట్‌ ‌ప్రకారం తెలంగాణ మొత్తం ఓ సింగరేణి కాలనీగా మారక ముందే, మరో పసిమొగ్గను డ్రగ్స్ ‌రక్కసి చిదిమేయక ముందే..కోటి రతనాల వీణ, విష సంసృతి వేదికగా మారకముందే, ప్రగతి భవన్‌ ‌మత్తు వదలాలి. ఫాంహౌస్‌ ‌పాలన నిద్రమత్తు వీడాలని అన్నారు. ఇదిలావుంటే తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్‌నేత అద్దంకి దయాకర్‌ ‌విమర్శించారు.

సోమవారం ఆయన గన్‌ ‌పార్క్ ‌వద్ద వి•డియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్టాన్న్రి తాగుబోతుల రాష్ట్రంగా మారిస్తే.. మంత్రి కేటీఆర్‌ ‌డ్రగ్స్ ‌రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం, డ్రగ్స్ ‌పంచుతున్నారని, ఐపీఎస్‌ అధికారి అకున్‌ ‌సబర్వాల్‌ ‌కమిటీ ఏమైందని ప్రశ్నించారు. ఈడీ విచారణకు రానా, రకుల్‌ ‌ప్రీత్‌సింగ్‌ ఎం‌దుకు వొచ్చారన్నారు. వైట్‌ ‌చాలెంజ్‌తో తెలంగాణ నుంచి డ్రగ్స్‌ను తరిమి కొడతామని అద్దంకి దయాకర్‌ ‌పేర్కొన్నారు. వైట్‌ ‌ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్  ‌బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్‌ ‌ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి యాక్సెప్ట్ ‌చేశారని….మంత్రి కేటిఆర్‌ ‌కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్‌ ‌చేశామని రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌చేశారు.

ఇకపోతే  రాజకీయ నాయకులు విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా ఉండాలని కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ అన్నారు. గన్‌పార్క్ ‌వద్ద వి•డియాతో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. నేను- కొండా విశ్వేశ్వరరెడ్డి- వి•రు డ్రగ్‌ ‌టెస్టులు చేయించుకుందామని అన్నారు. కేటీఆర్‌ ‌తన విశ్వసనీయత నిరూపించుకోవాలని సవాల్‌ ‌విసిరారు. మహారాష్ట్రలో జాతీయ సంస్థలు ఎవ్వరిని వదులకుండా విచారణ చేస్తున్నాయని షబ్బీర్‌ అలీ తెలిపారు.

Leave a Reply