Take a fresh look at your lifestyle.

పొగడ్తలొద్దు నేనొక దేశ సేవకుడిని మాత్రమే అన్న పివి

“పివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వుండడం ద్వారా, ఉత్తర ప్రదేశ్‌లోను, తదితర ప్రదేశాలలోను రక్తపాతం జరుగకుండా వుండే రీతిలో వ్యవహరించి దేశాన్ని కాపాడారనీ, ముఖ్యంగా ముస్లిం సోదరులను రక్షించారనీ, అంతేగాకుండా, తర్వాత అయోధ్యలో వివాదాస్పద స్థలంలో సంతులు, మహతులు మందిర నిర్మాణం పనులు చేపట్టినప్పుడు పివి వారిని అభ్యర్థించి పనులు ఆపుచేశారనీ, అంతకుముందు భారతీయ జనతాపార్టీ నాయకులు ఎంతగా చెప్పినా మందిర నిర్మాణ పనులు ఆపివేశారనీ ఆలీ సిద్ధికి వివరించారు. అటు హిందూ, ఇటు ముస్లిం మత పెద్దలను వొప్పించి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో కూడా పివి కృతకృత్యులయ్యారు.”

సాహితీవేత్త, బహుభాషాకోవిదుడు, అసాధారణ మేధావి, రాజనీతి చతురుడు, దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవినలంకరించి, తెలుగు తేజాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింప చేసిన మహా మనిషి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు నిరాడంబరతకు, నమ్రతకు, నిస్వార్థ సేవకు కూడా ఖ్యాతి గడించారనడంలో అతిశయోక్తి లేదు. పివి లోని కొనియాడదగిన అహంకార రాహిత్యం, ప్రచారం కోసం, బిరుదుల కోసం ప్రాకులాడక పోవడం, వంటి విషయాలను చాటి చెప్పే ఒక ఉదంతం గురించి ప్రస్తావిస్తానిక్కడ. అవి నేడు ఢిల్లీలో డక్కన్‌ ‌క్రానికల్‌, ఆం‌ధ్రభూమి దినపత్రికలకు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్న రోజులు. 1992 ఆగస్టు ఆదివారంలో క్రానికల్‌ ‌సంపాదకులు పి.ఎన్‌వి.నాయర్‌ ‌సికింద్రాబాద్‌ ‌నుండి నాకొక సందేశం వచ్చింది. ‘పివి.నరసింహారావు ది సేవియర్‌ ఆఫ్‌ ఇం‌డియా’ అనే ఆంగ్ల పుస్తకం ఆవిష్కరించడానికి ఢిల్లీలో జరగవలసిన కార్యక్రమం వాయిదా పడిందని తెలియజేస్తూ, దానికి గల కారణాలను, ఆ పుస్తకం గురించి వివరంగా రిపోర్టు పంపించమనీ, ఆ పుస్తకం సంపాదకుడు, ప్రచురణకర్త అయిన ఆలీ సిద్ధికి ని ఇంటర్వ్యూ చేయమనీ, ఆ సందేశం సారాంశం. దాని పర్యావసనంగా నేను ఆలీ సిద్దికి ని కలిసి మాట్లాడడం జరిగింది.

పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి ఆయన చెప్పిన కారణం నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఆ పుస్తకం అప్పటి కేంద్ర మంత్రి వర్గంలో రెండవ స్థానంలో వున్న అర్జున్‌సింగ్‌ ‌చేతుల మీదుగా జరగవలసివుంది. అయితే, పివి ఆ పుస్తకం టైటిల్‌లో వున్న ‘సేవియర్‌’ అనే నిర్వచనానికి అభ్యంతరం తెలిపారనీ ‘నాకు సేవియర్‌ ‌వంటి పొగడ్తలు, బిరుదులు వద్దు, నేనొక దేశ సామాన్య సేవకుడిని మాత్రమే, అందువల్ల ఆ టైటిల్‌ ‌మార్చాలి’ అని గట్టిగా నొక్కి చెప్పారనీ, అందువల్ల ఆ కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందనీ ఆలీ సిద్ధికి చెప్పారు. పివి మీద వున్న గౌరవంతో ఆ కార్యక్రమం ఆపామనీ, అయితే అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు – అర్జున్‌సింగ్‌, ‌డాక్టర్‌ ‌మర్రి చెన్నారెడ్డి, బలరామ్‌ ‌జాకర్‌, ‌జితేంద్ర ప్రసాద్‌ – ‌పివి ని ‘సేవియర్‌ ఆఫ్‌ ఇం‌డియా’ అని అభివర్ణించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని, ఆ బిరుదుకు వారు అన్ని విధాలా తగిన వారేననీ, అందువలన పుస్తకం టైటిల్‌ ‌మార్చవలసిన అవసరం లేదనీ సమర్థించారనీ అందువలన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో జరుగుతుందనీ ఆలీ సిద్ధికి తెలియజేశారు. (పుస్తకావిష్కరణ తర్వాత కొన్ని రోజులకు జరిగింది).

prajatantra news, telugu topics, short news in telugu, telugu articles, crime news, telugu kavithalu

ఏ కారణం చేతనో, ఈ పుస్తకం విషయం, పివి అభ్యంతరం చెప్పడం మొదలగు విషయాలు అంతగా ప్రచారంలోకి రాలేదు. పివి ఇడియాని రక్షించిన (సేవియర్‌) ‌గొప్ప వ్యక్తిగా అభివర్ణించడానికి తనను ప్రోత్సమించిన విషయాలను ఆలీ సిద్ధికి ఆ పుస్తకంలో విశదీకరించారు. పివి దేశం అతి క్లిష్ట సమస్యల నెదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని పదవి చేపట్టారు. రాజీవ్‌ ‌గాంధీ హత్యతో దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెంది, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎట్లా వుంటాయోననే సందిగ్ధంలో వున్న తరుణంలో పివి దేశ సారథ్యం చేపట్టారు. లోక్‌సభలో తమ కాంగ్రెసు పార్టీకి సంఖ్యా బలం (మెజారిటీ) లేకున్నా, మొదటి విశ్వాస తీర్మానంపై తనదైన ప్రత్యేక శైలిలో, కేవలం 35 నిమిషాలు మాత్రమే మాట్లాడి, సభ్యులందరి ఆదరణ పొంది, సభ విశ్వాసాన్ని చూరగొని, చాకచక్యంగా పూర్తి అయిదేళ్ల కాలం పరిపాలన పూర్తి చేశారు. తద్వారా దేశంలో స్థిరత్వం సాధించారు. పివి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే అయోధ్య విపత్తు (బాబ్రీ మసీదు కూల్చివేత) జరిగింది. అయితే పివి సంయమనంతో హుందాగా, చతురతతో ఆ సమస్యనెదుర్కొన్నారు.

ఆ సంఘటన జరిగిన వెంటనే, పివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వుండడం ద్వారా, ఉత్తర ప్రదేశ్‌లోను, తదితర ప్రదేశాలలోను రక్తపాతం జరుగకుండా వుండే రీతిలో వ్యవహరించి దేశాన్ని కాపాడారనీ, ముఖ్యంగా ముస్లిం సోదరులను రక్షించారనీ, అంతేగాకుండా, తర్వాత అయోధ్యలో వివాదాస్పద స్థలంలో సంతులు, మహతులు మందిర నిర్మాణం పనులు చేపట్టినప్పుడు పివి వారిని అభ్యర్థించి పనులు ఆపుచేశారనీ, అంతకుముందు భారతీయ జనతాపార్టీ నాయకులు ఎంతగా చెప్పినా మందిర నిర్మాణ పనులు ఆపివేశారనీ ఆలీ సిద్ధికి వివరించారు. అటు హిందూ, ఇటు ముస్లిం మత పెద్దలను వొప్పించి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో కూడా పివి కృతకృత్యులయ్యారు. ఆలీసిద్ధికి అంతకుముందు ఫోటోల ప్రాధాన్యంతో కూడిన పుస్తకాలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మహమ్మద్‌ ‌యూనస్‌ల గురించి ‘జై-హింద్‌-‌జై బంగ్లాదేశ్‌, ‘‌హింద్‌-అరబ్‌ ‌దోస్తి’ ‘ఫెయిత్‌ అం‌డ్‌ ‌ప్రిన్స్‌పుల్స్’ ‌ప్రచురించారు. (నేను ఈ పుస్తకం విషయంలో వ్రాసిన వ్యాసం డక్కన్‌ ‌క్రానికల్‌ ‌సెప్టెంబర్‌ 6, 1992 ఆదివారం సంచికలో ‘ఇంటర్వ్యూ ఆఫ్‌ ‌ద వీక్‌’ ‌కాలమ్‌లో ‘పివి ఈజ్‌ ‌ద సేవియర్‌ ఆఫ్‌ ఇం‌డియా’ హెడ్డింగుతో ప్రచురితమయింది)
– పిఎ.రామారావు
సీనియర్‌ ‌పాత్రికేయులు

Leave a Reply