Take a fresh look at your lifestyle.

నేను పార్టీ మారడం లేదు కాంగ్రెస్‌ ‌నేత శ్రీధర్‌ బాబు

తెలంగాణ కాంగ్రెస్‌ ‌మంథిని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల  శ్రీధర్‌ ‌బాబు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల పై ఆయన స్పందించారు.. కాంగ్రెస్‌ ‌పార్టీ వీడను ,టీఆరెస్‌ ‌లో చేరానని ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన గాంధీభవన్‌ ‌నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఒక విష ప్రచారంని ఎవరు  నమ్మవద్దుని ప్రకటన లో పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్‌ ‌లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారంపై స్పందించిన ఎమ్యెల్యే శ్రీధర్‌ ‌బాబు..పార్టీ వీడుతున్నట్టు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను ఖండించారు.ఇది కుట్ర పూరితంగా జరుగుతున్న ప్రచారమని తెలిపారు .ఈ వార్తల పై కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దన్నారు.

Leave a Reply