Take a fresh look at your lifestyle.

‘‘అమ్మ – అమ్మాయి మధ్యలో నేను’’

‘‘ఒకరు పునాది, మరొకరు భవిత
ఒకరు అండ, మరొకరు నమ్మకము
అమ్మ ఒక వృత్తము, అమ్మాయి మరొక వృత్తము
ఆ రెండింటి సంధిని నేను…’’

‘‘కాలగమనమునకు సాక్షి ఒకరైతే,
ఆశల విహంగానికి ఆలంబన మరొకరు.
వారిద్దరి కలబోత నేను,
నా చిరు దరహాస కారకులు వారు….’’

‘‘మా అమ్మకు నేను అదృష్టమైతే,
మా అమ్మాయికి నేను ఆదర్శం.
ఇది ఇంటింటి రామాయణం,
ప్రతి ఇంటి మధుర కావ్యం.
అందుకే మనం ….
పుట్టినింటి దీపాలం, మెట్టినింటి వెలుగులం.
అందరం అవని పుత్రికలం….’’
– పి. అరుణ, పిజిక్స్ ‌లెక్చరర్‌, ‌జీడీసీడబ్ల్యూ, కరీంనగర్‌,9849922868.
అం‌తర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా

Leave a Reply