Take a fresh look at your lifestyle.

పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

Hygiene should be given high priority State Transport Minister Puvvada Ajaykumarఖమ్మం నగర పరిశుభ్రంలో భాగం గా ఖమ్మం నగర మణిహారం అయిన లకారం ట్యాంక్‌ ‌బండ్‌పై ఎన్‌సిసి, మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టి న క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌ ‌కార్యక్రమాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌ప్రారంభించారు. అనంతరం చెత్త సేకకరణ వ్యాన్లను రిబ్బన్‌ ‌కట్‌ ‌చేసి ప్రారంభించారు.అదేవిధంగా కాంపాక్టర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగర సుందరీకరణ విజయవంతం అయిందని, ఇదే స్పూర్తితో ఖమ్మంను క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌ ‌తీర్చిదిద్దటంలో ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌ ‌సిబ్బందికి నగర వాసులు సహకరించి తడిచెత్తను, పొడిచె త్తను వేర్వేరుగా అందించాలన్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని సూ చించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌గుగులోతు పాపాలాల్‌, ‌నగర కమీషనర్‌ అనురాగ్‌ ‌జయంతి, డిప్యూటీ మేయర్‌ ‌బత్తుల మురళీప్రసాద్‌, ‌కార్పోరేటర్లు పునుకొల్లు నీరజ, పగడాల నాగరాజు, తోట రామారావు, కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, ఊటుకూరి లక్ష్మీసుజాత, కార్పోరేషన్‌ అధికారులు,సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు. అనంతరం ఆయన క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌లో టాంక్‌బండ్‌ ‌పరిసరాలను పరిశీలించారు.

మొక్కలు నాటిన అజయ్‌ ‌దంపతులు:
తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌తన పెళ్లిరోజు సందర్బంగా ఖమ్మం నగరంలో మొక్కలు నాటారు. ఆయన సతీమణి వసంతలక్ష్మీతో కలసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఖమ్మం నగరంలోని 22వ డివిజన్‌లో ఆ డివిజన్‌ ‌కార్పోరేటర్‌ ‌చావా నారాయణ రావు ఆధ్వర్యంలో కవిరాజనగర్‌ ‌ప్రాంతం లో నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో వారు మొక్కలు నాటి నీటిని పోసారు. పెళ్లిరోజు సం దర్బంగా మొక్కలు నాటటం చాలా చక్కటి కార్యక్రమమని పలువురు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌గుగులోతు పాపాలాల్‌, ‌కార్పోరేటర్లు దోరెపల్లి శ్వేత, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు తదితరులు పాలొ్గ న్నారు. ఇదిలా ఉండగా ఎన్‌ఎస్‌పి క్యాంపులోని ఎస్టీ బాలి కల హాస్టల్‌లో మంత్రి సతీమణి వసంత లక్ష్మీ తమ పెళ్లి రోజును పురస్కరించుకుని విద్యార్దినీలకు నోటు పుస్తకాలు, స్వీట్లు, చాక్‌లెట్లు పంపిణీ చేసారు. అనంతరం ఆమె విద్యార్దినీలతో కాసేపు ముచ్చటించారు. వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పోరేటర్‌ ఊటుకూరి లక్ష్మీసుజాత, దోరేపల్లి శ్వేత, పలువురు టిఆర్‌ ఎస్‌ ‌నాయకులు, ఎస్టీ బాలికల హాస్టల్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply