Take a fresh look at your lifestyle.

సామాజిక స్పృహతో పరిసరాల పరిశుభ్రత

రానున్న వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా ప్రజలు బాధ్యతతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్‌ ‌నగర మేయర్‌ ‌గుండా ప్రకాష్‌ ‌రావు పిలుపునిచ్చారు. సోమవారం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 26వ వార్డు ఎల్లంబజార్‌ ‌లో ఆయన, వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, ‌మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ ‌దయనంద్‌ ‌లతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి 8వ తేదీ వరకు బల్దియాలో 58 డివిజన్లలో ‘‘ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం’’ పటిష్టంగా నిర్వహించుటకు పక్క ప్రణాళిక రూపొందించామని అన్నారు.ప్రభుత్వాలు ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నగర ప్రజలు సామాజిక బాధ్యతగా భాగస్వాములై పరిశుభ్రంగా ఇల్లు , పరిసరాలను ఉంచుకొంటు సీజనల్‌ ‌వ్యాధులు దరిచెరకుండా చూసుకోవాలని కోరారు. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలను గుర్తించాలని, సామాజిక స్పృహ తో పారిశుధ్యాన్ని పాటిస్తూ వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, వైరల్‌ ‌ఫీవర్‌ ‌లాంటి వ్యాధులతో అనారోగ్యానికి గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్‌ ‌తెలిపారు. వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ‌మాట్లాడుతూ కరోనా మహమ్మారి వెంటాడుతున్న ఈ విపత్కర సమయంలో రానున్న వర్షాకాలం దానికి కలిసొచిందని, ఈ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే కఠినంగా కొన్ని నియమాలు పాటించాలని అన్నారు. పరిస్థితి చెయ్యి దాటిపోతే ఏ ప్రభుత్వాల వల్ల కాదు, కావున జాగ్రత్త వహించాలి.

ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రానున్న రోజుల్లో కరోనా వ్యాధితో సహజీవనం చెయ్యాల్సిన పరిస్థితి ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించుకొని, ఎప్పటికప్పుడు చేతులను సానిటైజర్‌ ‌లేదా సబ్బుతో కడుగుకొని, తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతి మాట్లాడుతూ ఖాళీ ఫ్లాట్స్ ‌గల యజమానులు వారి స్థలాల్లో, ఇంటి ముందు నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి, లేని యెడల మున్సిపాలిటీ కొత్త చట్టం ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఓనర్‌ ‌కం డ్రైవర్‌ ‌గా స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రతిరోజు చెత్త సేకరిస్తున్నారని,వారికి బల్దియా నుండి ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదని, నెలకు ప్రతి ఇంటి నుండి రూ.60లు తప్పకుండా చెల్లించాలని కోరారు. అదనపు కలెక్టర్‌ ‌దాయానంద్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 8 రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా చెత్త, ఇంటి శిధిలాలు, మురుగు కాలువల పూడిక, చెత్తా తీయడం, లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం ఎల్లంబజార్‌ ‌వీధులలోని మురికి కాలువల్లో దోమలు పెరగకుండా, నివారించేందుకు మేయర్‌, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌, ‌కమిషనర్లు పిచికారీ చేసి ఆయిల్‌ ‌బాల్స్ ‌వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ‌రాజి రెడ్డి, అదికారులు, అనధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!