Take a fresh look at your lifestyle.

వోటుకు దూరంగా హైదరాబాదీలు

“కొరోనా కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో పోలింగ్‌ ఏవిధంగా ఉంటుందనే విషయం ఆసక్తి రేకేత్తిస్తోంది. అసలే ఎన్నికలంటే అంతంత మాత్రం ఆసక్తి చూపించే నగర వోటరు కొరోనా భయానికి పోలింగ్‌ ‌కేంద్రానికి వస్తాడా ? రాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి తోడు సీఎం కేసీఆర్‌ ‌కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రమాదం పొంచి ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నారు.”

ప్రతీసారీ 50 శాతం లోపే పోలింగ్‌  ‌సెలవిచ్చినా కదలని ఐటీ ఇతర ఉద్యోగులు 20 శాతం వోట్లతోనే కార్పొరేటర్ల ఎన్నిక

ప్రజాస్వామ్యానికి వోటే పునాది. నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం వోటు ద్వారా కల్పించినప్పటికీ హైదరాబాద్‌ ‌నగర ప్రజలు వోటింగ్‌ ‌పట్ల అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిం చాల్సిన కార్పొరేటర్లను ఎన్నుకునేందుకు పోలింగ్‌ ‌రోజు వోటర్లు ఉత్సాహం చూపాలి. అయితే, హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కేవలం 20 నుంచి 23 శాతం మంది వోటర్లు ఎన్నుకున్న వ్యక్తులు కూడా ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. •••దరాబాద్‌ ‌మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎం‌సి) ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నప్పటికీ నగర వోటరుపై మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు.పోలింగ్‌ ‌రోజున ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలూ సెలవుగా ప్రకటిస్తున్నప్పటికీ…ముఖ్యంగా విద్యావంతులైన వోటర్లు గడప దాటడం లేదు.ఐటీ సహా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నతోద్యోగులు, సంపన్నులు అధికంగా ఉండే కాలనీల్లోని ప్రజలు పోలింగ్‌ ‌కేంద్రాల ముఖంచూడటం లేదు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రతీ వొక్కరూ వోటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ప్రతీసారీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే, ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు గ్రామీణ ప్రాంతాలలో ఫలిస్తున్నంతగా, పట్టణాలు,, నగరాలలో మరీ ముఖ్యంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వాసులు మాత్రం స్పందించడం లేదు. ఇదిలా ఉండగా, కొరోనా కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో పోలింగ్‌ ఏవిధంగా ఉంటుందనే విషయం ఆసక్తి రేకేత్తిస్తోంది.

అసలే ఎన్నికలంటే అంతంత మాత్రం ఆసక్తి చూపించే నగర వోటరు కొరోనా భయానికి పోలింగ్‌ ‌కేంద్రానికి వస్తాడా ? రాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి తోడు సీఎం కేసీఆర్‌ ‌కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రమాదం పొంచి ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంపై నగర వోటర్లలో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో వోటింగ్‌ ‌శాతం పెరిగితే అది ప్రభుత్వ వోటమికి దారితీస్తుందన్న భయంతోనే సీఎం ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, అధికార టీఆర్‌ఎస్‌పై నగర ప్రజలకు ఉన్న అసంతృప్తిని వోట్ల రూపంలో మలచుకునేందుకు బీజేపీ, ఎంఐఎంలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎంత మంది ప్రజలను పోలింగ్‌ ‌కేంద్రాలకు రప్పించి భారీ శాతం వోటింగ్‌ ‌నమోదయ్యేలా చూస్తే అంతగా తమకు లాభిస్తుందనే •ఆలోచనతో ప్రచారాన్ని ఉధృతం చేసి అధికార టీఆర్‌ఎస్‌పై పైచేయి సాధించాలని చూస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాల మధ్య నగర వోటరు ఎటువైపు మొగ్గు చూపుతాడనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక హై•దరాబాద్‌ ‌నగరంలో బల్దియా ఎన్నికల వోటింగ్‌ ‌సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. 2002లో అప్పటి ఎంసిహెచ్‌కు జరిగిన ఎన్నికలలో కేవలం 41.22 శాతం మంది వోటర్లు మాత్రమే తమ వోటు హక్కును వినియోగించుకున్నారు,.

మొత్తం వోటర్ల సంఖ్య 26,78,009గా ఉందగా, 11,04,076 వోట్లు పోలయ్యాయి. వీటిలో చెల్లనివి 54,837 కాగా, టెండర్‌ ‌వోట్లు 12. ఫలితంగా కొన్ని డివిజన్లలో కేవలం 15 శాతం మంది వోటు వేసిన అభ్యర్థులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్కికయ్యారు. ఆ తరువాత 2009లో అప్పటి ఉమ్మడి ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ఎంసిహెచ్‌ ‌శివార్లలోని 12 మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సి)గా మార్చారు. ఈ ఎన్నికల నాటికి ప్రజలు వోటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అయినప్పటికీ ఈ ఎన్నికలలోనూ 42.92 శాతం వోటర్లు మాత్రమే తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి జీహెచ్‌ఎం‌సిలో మొత్తం 56,99,639 మంది వోటర్లుగా నమోదు కాగా, వాటిలో 23,98,105 మంది నగర ప్రజలు వోటింగ్‌లో పాల్గొన్నారు. ఇక 2016లో జీహెచ్‌ఎం‌సికి జరిగిన ఎన్నికలలో 45.27 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. ఈసారి వోటర్ల సంఖ్య 74,23,980కి పెరగగా, 33,60,543 మంది పోలింగ్‌లో భాగస్వాములయ్యారు. మరోవైపు, గడచిన ఐదేళ్లలో నగర జనాభా పెరిగినప్పటికీ వోటర్ల సంఖ్య అనూహ్యంగా తగ్గినట్లు జీహెచ్‌ఎం‌సి రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తంగా 31,961 మంది వోటర్లు తగ్గారు. గత ఎన్నికల సమయానికి గ్రేటర్‌లో 74,36,247 మంది వోటర్లు ఉండగా, ఆ సంఖ్య ప్రస్తుతం 74,04,286గా నమోదైంది. ఈ వోట్లలో పురుష వోటర్లలో అత్యధిక సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. మొత్తం 1,16,605 మంది పురుష వోటర్ల సంఖ్య తగ్గగా, మహిళా వోటర్ల సంఖ్య మాత్రం 84,929కి పెరగడం గమనార్హం. ఇదిలా ఉండగా, 2002 నుంచి 2016 వరకు జరిగిన హైదరాబాద్‌ ‌నగర పాలక సంస్థ ఎన్నికల వోటింగ్‌ను పరిశీలిస్తే…ఎక్కువగా బస్తీలు, మురికివాడల ప్రజలే వోటు హక్కును వినియోగించుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.

హైదరాబాద్‌ ‌మహా నగరంలో విద్యావంతులు, సంపన్నులు, ఉన్నతోద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అధికంగా ఉండే ప్రాంతాలైన మాదాపూర్‌, ‌జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్,‌కొండాపూర్‌, ‌గచ్చిబౌలి, బేగంపేట, చందానగర్‌, ‌ఫిల్మ్‌నగర్‌, ‌షేక్‌పేట, ఆబిద్స్ ‌తదితర ప్రాంతాల్లో ప్రతీ ఎన్నికల్లోనూ కనీసం 50 శాతం వోటింగ్‌ ‌కూడా నమోదు కాలేదు. ఇక పాతబస్తీ, సికింద్రాబాద్‌, ‌ఖైరతాబాద్‌, ‌నాంపల్లి, మారేడుపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ ‌వంటి ప్రాంతాలలో మాత్రం వోటింగ్‌ ‌శాతం కొంతమేర గరిష్టంగా కనిపిస్తోంది.

వోటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా : పార్థసారధి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌
‌వోటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారధి అన్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సన్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో జీహెచ్‌ఎం‌సి వోటర్లకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో వోటు వేసి వార్డుల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. యువత, విద్యాధికులు తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొని వోటింగ్‌ ‌శాతం పెంచాలని కోరారు. డిసెంబర్‌ 1‌న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ప్రతీ వొక్కరూ వోటు హక్కును వినియోగించుకుని వోటింగ్‌ ‌శాతం పెంచాలని పార్థసారధి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply