Take a fresh look at your lifestyle.

అప్రమత్తం కావాల్సిన సందర్భం

“శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. భిన్న సంస్కృతులకు నిలయం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకల వారసత్వం కొనసాగిస్తూ ,అభివృద్ధి, సహజీవన సౌందర్యంతో, అందరికి నీడనిచ్చి అన్నం పెట్టి ఆదుకునే అమ్మ తెలంగాణను, గుండె కాయ హైద్రాబాద్‌ ‌ను ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులను కలుపుకుని పోవాల్సిన చారిత్రాత్మక బాధ్యతను కేసీఆర్‌ ‌యుద్ధ ప్రాతిపదికన చేపట్టినప్పుడే తెలంగాణను అన్ని రకాల చాందసవాద, మతోన్మాదుల నుండి కాపాడుకోగలం.

స్వరాష్ట్రంలో ఉద్యమ నాటి ఆకాంక్షలను, అవసరాలను ప్రజలకు చేరవేయడంలో పాలకుల చింతన, నిబద్ధత ఉద్యోగుల ఫలితంగా ఆనతి కాలంలోనే తెలంగాణ తలసరి ఆదాయం, అనూహ్య వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, మాతా శిశు సంక్షేమం, ఆరోగ్యం వంటి అనేక అభివృద్ధి సూచికలలో అగ్ర స్థానాలలోకి చేరుకుంది. సుస్థిర, సమ్మిళిత విధానాలతో ప్రజల నుండి ప్రజలకు, ప్రజల కోసం అనే భావనతో సంక్షేమ కార్యక్రమాల అమలు, గత అరేండ్ల నుండి వికాసం కోసం సమస్త వర్గాలు పని చేయడం ద్వారా ఈ ప్రగతి సాధ్యమయ్యింది.శాంతి కాముక, సహజీవన, సంతోష సూచికలలో దేశములోనే తెలంగాణ, దక్షిణ భారత గుండెకాయ హైద్రాబాద్‌ ‌చిరునామా గా మారింది.కానీ ఇవేమీ ప్రజలను పెద్ద ఎత్తున కదిలించలేకపోయాయి.”

ప్రజల అభివృద్ధి రాజ కీయాలు తమ నిఘం టువులో లేని కేవలం ప్రజల వ్యక్తిగత విశ్వాసాలతో, భావో ద్వేగాలను రెచ్చగొట్టి వైషమ్యాలను సృష్టించే శక్తులకు జి ఎచ్‌ ‌యమ్‌ ‌సి పీఠం ఇవ్వకుండా నగర ప్రజలు విజ్ఞత ప్రదర్శిం చారు. అయితే ఆ శక్తుల ప్రాబల్యంను నిరోధిం చడంలో క్రియాశీలతను ప్రదర్శించ లేకపోయారు.ఎంతో ఉత్కంఠను కలిగించిన జిహెచ్‌ఎమ్‌ ‌సీ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలను రేకెత్తించాయి. విద్వేష రాబందులు, మతంతో మనుషులను కొలిచే ఉత్తరాది విషపు గాలుల మహమ్మారుల దాడిని ప్రజాస్వామ్య ప్రతిఘటనతో పూర్తిగా నిలువరిస్తారనే ఆశలు అంతగా ఫలించలేదు.

శతాబ్దాల చరిత గల దక్షణ భారత గుండెకాయ హైద్రాబాద్‌ ‌కు గల అపురూప శాంతి కాముకత, సహజీవన విలువల వారసత్వాన్ని ఇంకా బలంగా కొనసాగాలనే ఆకాంక్షకు కొద్దిగా గండి పడింది..గత ఎన్నికలలో నగర ప్రజలు చూపిన బాట ఈ సారి కూడా మరింత ఉత్సహంతో అనుసరిస్తారని, దేశ నమూనా గా మారడానికి మరొక్క సారి ఈ ఫలితాలు ప్రేరణాత్మకంగా నిలుస్తాయనుకున్నారు. వైవిధ్యమే ప్రకృతికి రక్ష,మానవ జీవనానికి కంఠాభరణం ,ఏడు భాషలు ఏడు మతాల ప్రజలు సహజీవన ఇంద్రధనస్సును నగర గగనం పై అనుకున్నంతగా ప్రకాశింప చేయలేకపోయారు.

భారత దేశ చరితలో తెలంగాణ పోరాటాలు,ప్రజల ఆకాంక్షలు,తీర్పులు విలక్షణంగా ఉంటూ వచ్చాయి. తిరుగుబాటు పై తిరుగుబాటు వెలుగులో కొనసాగుతూ ఫాసిస్ట్ అ‌ప్రజాస్వామిక శక్తులను ఈ గడ్డపై కొనసాగకుండా వీరోచిత పోరాటాలను నడిపాయి.ప్రజలే సంపదగా భావించి పాలన నడిపిన కాకతీయులు,కుతుబ్‌ ‌షాహీలు ఉత్తరాది సామ్రాజ్యవాదులకు ఎప్పుడూ లొంగలేదు. కాకతీయులు ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టినప్పుడు సమ్మక్క సారక్క తిరుగుబాటు చరిత మనది.ఈ నగర సముద్రంలో చేపల లాగా ప్రజలు నిండిపోవాలని తపన పడిన కుతుబ్‌ ‌షాహీల పాలనలో చివరి అంకంలో తలెత్తిన మతోన్మాద రజాకార్లను తుడముట్టించిన దొడ్డి కొమురయ్య,ఐలమ్మ ల చరిత మనది. రాజుల సంస్కృతి ప్రజల పై రుద్దడం తప్పని ధిక్కరించిన పోతన, సోమనాధ దేశీయ ధిక్కార చైతన్యం మనది.ఈ విధంగా సామ్రాజ్యవాద ఆధిపత్య,సాంస్కృతిక అణచివేత రాజకీయాలను ప్రతిఘటించడం తెలంగాణ మాగాణ స్వభావంగా ఉంటూ వచ్చింది. వీర శైవం, బౌద్ధం, జైనం, ఇస్లామ్‌ ‌సూఫీ ధర్మాలు సహజీవన సౌరభాలను వెదజల్లాయి. మతతత్వ రహిత ప్రాంతంగా ప్రాచీన మధ్య యుగ కాలం నుండి విలసిల్లుతూనే ఉంది..అది ఇప్పుడు ప్రమాదంలో పడిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అభివృద్ధి, ఆధునికీకరణ గురించి ఎన్నడూ మాట్లాడని, అసమానతలు ప్రశ్నించని, ఆధిపత్య దోపిడీ పీడక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే శక్తులు కేసీఆర్‌ ‌జనహిత పాలనలో దొర్లిన కొన్ని అపశ్రుతులను తమ గోబెల్స్ ‌ప్రచారం ద్వారా గందరగోళానికి గురి చేశాయి.తమ స్వభావ చీలికల పేలికల విష ప్రచారం ద్వారా కొన్ని సమూహ ప్రజలను బూచిగా చూపెడుతూ నగర ప్రజల ఎమోషన్స్ ‌పెంచి వాటి ఆసరాగా అధికారంలోకి రావాలని అనుకున్న ఫాసిస్ట్ ‌లకు అనైతిక దుర్మార్గ ప్రచారము చాలా పని చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి,చివరకు విజయం సాకారవుతున్న వేళలో కేంద్రపాలిత ప్రాంతంగా నగరాన్ని మార్చడానికి కుట్రలు పన్ని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక తప్పిదం మోడీ షా పరివార్‌ ‌ద్రోహాన్ని ప్రజలు మరచిపోయారు.అలాగే గత ఆరేళ్ళ మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు,ఆర్ధిక వ్యవస్థ ల అధఃపాతాళానికి పోయి ప్రజల కడగండ్లకు బిజెపి ముఖ్య కారణమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారంలో టి ఆర్‌ ఎస్‌ ‌శ్రేణులు,వారి సోషల్‌ ‌మీడియా దారుణంగా విఫలమయ్యింది.

స్వరాష్ట్రంలో ఉద్యమ నాటి ఆకాంక్షలను,అవసరాలను ప్రజలకు చేరవేయడంలో పాలకుల చింతన, నిబద్ధత ఉద్యోగుల ఫలితంగా ఆనతి కాలంలోనే తెలంగాణ తలసరి ఆదాయం, అనూహ్య వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల,మాతా శిశు సంక్షేమం ,ఆరోగ్యం వంటి అనేక అభివృద్ధి సూచికలలో అగ్ర స్థానాలలోకి చేరుకుంది. సుస్థిర, సమ్మిళిత విధానాలతో ప్రజల నుండి ప్రజలకు,ప్రజల కోసం అనే భావనతో సంక్షేమ కార్యక్రమాల అమలు, గత అరేండ్ల నుండి వికాసం కోసం సమస్త వర్గాలు పని చేయడం ద్వారా ఈ ప్రగతిసాధ్యమయ్యింది. శాంతి కాముక,సహజీవన,సంతోష సూచికలలో దేశములోనే తెలంగాణ ,దక్షిణ భారత గుండెకాయ హైద్రాబాద్‌ ‌చిరునామా గా మారింది.కానీ ఇవేమీ ప్రజలను పెద్ద ఎత్తున కదిలిం చలేకపోయాయి.

ఈ క్రమంలో హైదరాబాద్‌ అం‌తర్జాతీయ నగరంగా విఖ్యాతి పొందినది.భారతదేశం లో ఏ నగరం పొందని ప్రపంచ పెట్టుబడుల ప్రవాహం వచ్చింది.సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతంగా హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా వికాసం చెందుతున్నది. ప్రపంచ అగ్రశ్రేణి బహుళ జాతి సంస్థలు, సాఫ్ట్ ‌వేర్‌ ,అమెజాన్‌ ‌వంటి ఈ కామర్స్ ‌సంస్థలు,అనేక ఫార్మసీ,జీవ సాంకేతిక సంస్థలు తమ కార్యక్రమాల విస్తరణకు హైదరాబాద్‌ ‌ను ఎంచుకున్నారు. ఫలితంగా ప్రజలకు యువతకు విద్యావంతులకు లక్షలాదిగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తున్న దృశ్యం మన ముందు ఉన్నది. అయితే ఈ ఎన్నికలలో ఆధునీకరణ ,నూతన పెట్టుబడి ఫలితాలు అందుకుని ఉపాధి పొందుతున్న విద్యావంతుల వర్గాల ఉదాసీనత వలన వోటింగ్‌ ‌లో పాల్గొనకపోవడం వలన ఇంకా అనుకున్న ఫలితాలు టి అర్‌ ఎస్‌ ‌కు రాలేక పోయాయి..

ఒక దశలో ఫాసిస్ట్ ‌లు రాజ్యాంగ స్ఫూర్తి కి భిన్నంగా హిందూ రాష్ట్రం,సర్జికల్‌ ‌దాడులు,రోహింగ్యాలు వంటి విద్వేష ప్రచారంతో హైద్రాబాద్‌ ‌లో పాగా వేస్తారన్న ఆందోళనతో వామపక్ష శ్రేణులు,ప్రగతిశీల ప్రజాతంత్ర వాదులు టి ఆర్‌ ‌యస్‌ ‌విధానాలతో విభేదం ఉన్న గులాబీ శ్రేణులు కు తోడ్పడాలని సామాజిక మాధ్యమాల ద్వారా,మౌఖికంగా ప్రచారం గావించారు.ఒక ప్రధాన పత్రిక సంపాదకులు ప్రధానంగా కె . శ్రీనివాస్‌ ‌తమ వ్యాసాల ద్వారా మత వాదుల నిరోధం కోసం కదలాలి అని బుద్ధిజీవులకు ,గులాబీ పాలకులకు హితవు పలికారు. .ఏది ఏమైనా నిఖార్సయిన తెలంగాణ శ్రమ జీవుల, లౌకిక శక్తుల అప్రమత్తతతో టి ఆర్‌ ‌యస్‌ ఈ ‌మాత్రం గౌరవమైన విజయం సాధించింది.

ఈ ఎన్నికల ఫలితాలతో అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సిన భాద్యత కేసీఆర్‌ ‌పై ఉంది.పాలన పరమైన విజయాలను అనేక సూచికలు తెలియచేస్తున్న వాటి ఫలాలు అందుకోవడంలో వైఫల్యం పై సమీక్ష చేసుకోవాలి.రాష్జ్త సాధనలో నీళ్లు నిధులు తో పాటు మన భాష సంస్కృతులు పరాయికరణ లు కూడా ఉద్యమ ఎజెండా గా పని చేశాయి.తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వ ఆత్మ భాషా సాంస్కృతుల కొనసాగింపుకు చైనా లాగా ప్రత్యేక సాంస్కృతిక విప్లవం నిరంతరము కొనసాగాలి. ఈ క్రమం లో బీజేపీని ఆర్యన్‌ ‌సాంస్కృతిక సామ్రాజ్యవాదం రాజకీయ సాంస్కృతిక భావజాల ప్రతినిధిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు.తమ అస్తిత్వ ఆత్మ గౌరవాన్ని ప్రమాదం.అని తెలుసుకుంటారు.అప్పుడే సంఘ్‌ ‌పరివార్‌ ‌విస్తరణ,విజృంభణల నుండి తెలంగాణను కాపాడగలరు.

బిజెపి స్థాపనకు ప్రేరణ అయిన ప్రపంచానికి ప్రమాదకరంగా తయారయిన హిట్లర్‌ ‌ను కూలదోయటానికి విరుద్ధ భావజాలాలు ఉన్న రష్యా బ్రిటన్‌ అమెరికాలు కలిసి పని చేసి విజయం సాధించాయి. తెలంగాణలో మతోన్మాద ,విద్వేష ,ప్రజలను చీల్చే భావజాలానికి విరుగుడుగా పని చేసే వామపక్ష,ప్రజాతంత్రవాదులు అధిక సంఖ్యలో ఉన్నారు.వారి పై సాచివేత ధోరణులు మానుకొని ఫాసిస్ట్ ‌వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మాణం చేయాలి.ఇప్పుడు పాలక పక్షంలో, భూస్వామ్య శక్తులకు, మతోన్మాద వ్యతిరేకం గా జరిగిన పోరాటంలో అనుభవమున్న అనేక మంది ప్రగతిశీల వామపక్ష అంబెడ్కర్‌ ‌వాదులు శాసన సభ్యులుగా,మంత్రులుగా ఉన్నారు.వీరి సేవలు విరివిగా ఉపయోగించుకోవాలి.

పథకాల అమలులో జాప్యం ,ఏమైనా విధానాల తమ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయనే తలపులో ప్రజలు నిర్వహిస్తున్న నిరసన,ఆందోళనలను నిర్లక్ష్యం చేయకుండా సంప్రదింపులు జరిపే సంస్కృతి బలపడాలి. తెలంగాణను సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో గుర్తింపు పొందాలనే పని చేస్తున్న కేటీఆర్‌,‌రైతాంగ శ్రామిక వర్గ ప్రజలలో విశేష గుర్తింపు ఉన్న హరీష్‌ ‌రావు ల ద్వయం ఒక్కటి అని,ప్రతిచోటా వారి ఉమ్మడి ప్రచారం చేయాలి.

అలాగే తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్‌ ‌పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిర్దేశించిన పని గంటల కంటే ఎక్కువగా పని చేస్తున్న ఉద్యోగుల సహజ హక్కులు పీఆర్సీ,ఐఆర్‌ ‌లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉద్యోగుల అసంతృప్తిని తగ్గించే చర్యలను తక్షణమే చేపట్టాలి.సమాజంలో మేధో వర్గంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంది.వీరి అశాంతి విద్వేష శక్తులకు ఆజ్యం పొసే విధంగా తయారవుతున్నది.సేవా పేరుతో కోట్లు సంపాదించిన ప్రవేట్‌ ‌విద్యా ,వైద్య సంస్థల నిర్వాహకులు తమపై కమర్షియల్‌ ‌పన్నులను వసూలు చేస్తున్నారని అక్కసుతో కాషాయ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలిచిన వైనం స్పష్టంగా కనిపించింది.విద్య వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలనే అవసరాన్ని ఇది సూచిస్తుంది.టీచర్ల పోస్ట్ ‌నియమకాలను భారీగా చేపట్టాలి.స్థానిక వనరులతో యువతకు ఉపాధి పెంచే అవకాశాలను సృష్టించాలి.

శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. భిన్న సంస్కృతులకు నిలయం ,బిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకల వారసత్వం కొనసాగిస్తూ ,అభివృద్ధి ,సహజీవన సౌందర్యంతో, అందరికి నీడనిచ్చి అన్నం పెట్టి ఆదుకునే అమ్మ తెలంగాణను,గుండె కాయ హైద్రాబాద్‌ ‌ను ప్రజాస్వామిక,ప్రగతిశీల శక్తులను కలుపుకుని పోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ను కేసీఆర్‌ ‌యుద్ధ ప్రాతిపదికన చేపట్టినప్పుడే తెలంగాణను అన్ని రకాల చాందసవాద, మతోన్మాదుల నుండి కాపాడుకోగలం.

asnala srinivas
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం

Leave a Reply