Take a fresh look at your lifestyle.

ఉత్తరాఖండ్‌లో హైదరాబాద్‌ ‌యువతులు క్షేమం

ఉత్తరాఖండ్‌ ‌వరదల్లో చిక్కుకుపోయిన హైదరాబాద్‌ ‌యువతులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మల్కాజిగిరి ఆర్‌.‌కె.నగర్‌ ‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు..దసరా సెలవులకు ఉత్తరాఖండ్‌ ‌వెళ్లారు. అకస్మాత్తుగా అక్కడ వరదలు ముంచెత్తడంతో గత నాలుగు రోజులుగా లేమన్‌ ‌ట్రీ ప్రాంతంలో చిక్కుకున్నారు. అక్కడ తాము ఒక బిల్డింగ్‌ ‌మూడవ అంతస్తుపై చిక్కుపోయామని..రెండవ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నామని కాపాడాలంటూ కోరారు. తమను కాపాడటానికి ఎవరు ఇక్కడ అధికారులు రావడంలేదని..తమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎంఓకు ట్విట్‌ ‌ద్వారా కోరారు. కాగా..తమ పరిస్థితి గురించి ట్వీట్‌ ‌చేయడంతో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పందించారు.

వెంటనే ఉత్తరాఖండ్‌ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్‌ అధికారులు.. హైదరాబాదీ యువతులను కాపాడారు. లేమన్‌ ‌ట్రీ ప్రాంతంలోని జిమ్‌ ‌కార్బెట్‌ ‌నేషనల్‌ ‌పార్కులో వరదల్లో చిక్కుకున్న సుష్మ మిత్రబృందం దగ్గరకు వెళ్లి సహాయ బృందాలు కాపాడాయి. దీంతో తమ వాహనంలో సుష్మ, ఆమె స్నేహితులు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తమను కాపాడేందుకు చర్యలు తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాఖండ్‌ ‌వరదల్లో హైదరాబాద్‌ ‌మల్కాజిగిరి ఆర్‌.‌కె.నగర్‌ ‌కు చెందిన యువతులు చిక్కుకున్నారు.దసరా సెలవులకు వీరు ఉత్తరాఖండ్‌ ‌వెళ్లారు.

అకస్మాత్తుగా అక్కడ వరదలు ముంచెత్తడంతో గత నాలుగు రోజులుగా అక్కడ లేమన్‌ ‌ట్రీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అక్కడ తాము ఒక బిల్డింగ్‌ ‌మూడవ అంతస్తుపై చిక్కుపోయామని.. రెండవ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో తాము ఉన్నట్లు బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలకు ఉత్తరాఖండ్‌లో  నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రాల్లోఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Leave a Reply