Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ అభివృద్ధి మీద చర్చకు రెడీ : టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌

‌ధర్మం కోసం పోరాటం చేస్తామని చెప్పుకునే బీజేపీ నాయకులు గుంట కాడి నక్కల్లాగా కాంగ్రెస్‌ ‌నాయకుల ఇంటి చుట్టూ ఎందుకు  తిరుగుతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. ఇతర పార్టీల చుట్టూ తిరగడం కన్నా వారి పార్టీలో ఉన్న వారికి టికెట్‌ ఇచ్చుకోండని హితవు పలికారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…బండ కార్తీక రెడ్డి, సర్వే సత్యనారయణను సస్పెండ్‌ ‌చేసి రెండేండ్లు అయ్యిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌దేశ ద్రోహి అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బీజేపీనే కదా…! కేసీఆర్‌ ‌మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని  ప్రశ్నించారు.

నడ్డా కూడా హైదరాబాద్‌కు వొచ్చి కేసీఆర్‌ అవినీతి చేసాడని చెప్పినా చర్యలు తీసుకోకపోవడానికి కారణం కేసీఆర్‌ ఎని టైమ్‌ ‌మోడీ కోసం పనిచేయడమేనని అన్నారు. భారతీయ జనతా పార్టీ కొరోనా సమయంలో, వరదల సహాయంలో హైదరాబాద్‌కు చేసింది ఏమి లేదని అన్నారు. రెండు సందర్భాలలో కూడా కాంగ్రెస్‌ ‌ప్రజలకు అండగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ ‌నగర అభివృద్ధి మీద చర్చకు కాంగ్రెస్‌  ‌రెడీ అని సవాల్‌ ‌చేశారు. జిహెచ్‌ఎం‌సీ ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలని, కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆరెస్‌ను ప్రశ్నిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply