Take a fresh look at your lifestyle.

భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం

ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. సరూర్‌ నగర్ చెరువు పొంగడంతో శారదానగర్, తిరుమల నగర్, కోదండరాంనగర్, సీసల బస్తీ కాలనీ, కమలానగర్ ప్రాంతాలన్నీ నీటితో నిండాయి. సరూర్ నగర్ నుండి వస్తున్న నీటిలో నురుగుతో కూడిన నీరు వస్తుండడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మురుగు కుప్పగా మారిపోయింది ఇప్పటివరకు అధికారులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నగరంలో రోడ్లన్నీ నదులని తలపిస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

ఇంత జరుగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా భయం భయంగా గడిపామని, ఇలాగే వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎల్బీనగర్ నియోజకవర్గం మురుగు కుప్పగా మారిపోయింది.బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో ఆర్ వి.ఆర్ హరిహారపురం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ బతుకమ్మ కుంట లింగోజిగూడ లో గ్రీన్ పార్క్ కాలనీ సాయి నగర్ ధర్మపురి కాలనీ నగోల్ డివిజన్ అయ్యప్ప కాలనీ గడ్డిఅన్నారo పీఎన్ టి కాలనీ సీసాలబస్తీ ముంపు.

Leave a Reply