Take a fresh look at your lifestyle.

రెడ్ జోన్ లో హైదరాబాద్

  • కొరోనా హాట్‌స్పాట్‌ ‌జాబితాల విడుదల
  • దేశంలో మొత్తం 700 జిల్లాలను హాట్‌స్పాట్‌ ‌జిల్లాలు

కోవిడ్‌-19 ‌వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా కేంద్రం విభజించింది. దేశంలోని మొత్తం 700 జిల్లాలను హాట్‌స్పాట్‌ ‌జిల్లాలు, హాట్‌స్పాట్‌యేతర జిల్లాలు, గ్రీన్‌ ‌జోన్‌ ‌జిల్లాలుగా విభజించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్టాల్రకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్టాల్ర సీఎస్‌లను కేంద్రం కోరింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్టాల్రకు ప్రత్యేక లేఖలు రాశారు. 28 రోజులపాటు ఒక్క కేసు నమోదు కానిపక్షంలో హాట్‌స్పాట్‌ను గ్రీన్‌జోన్‌లోకి మార్చాలంది. హాట్‌స్పాట్‌ ‌జిల్లాలు, కంటైన్మెంట్‌ ‌జోన్ల వివరాలను రాష్టాల్రకు పంపించింది.. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్‌ ‌హాట్‌స్పాట్‌లుగా, మిగిలినవాటిని గ్రీన్‌ ‌జోన్లుగా గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్టాల్లోన్రి హాట్‌ ‌స్పాట్‌ ‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఇక హాట్‌స్పాట్‌ ‌జిల్లాలను రెండింటిగా విభజించింది.

- Advertisement -

అందులో విస్తృతి ఎక్కువగా ఉన్నవి, క్లస్టర్లలో విస్తృతి ఉన్నవిగా విభజించారు. వారి వివరాల ప్రకారం..
‌తెలంగాణలో హాట్‌ ‌స్పాట్‌ ‌జిల్లాలు: హైదరాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌ అర్బన్‌, ‌రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్‌, ‌మేడ్చల్‌-‌మల్కాజిగిరి, కరీంనగర్‌, ‌నిర్మల్‌గా ప్రకటించారు. తెలంగాణలో ఆరెంజ్‌ ‌జోన్‌ (‌నాన్‌-‌హాట్‌స్పాట్‌) ‌జిల్లాలు : సూర్యాపేట, ఆదిలాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌కామారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ ‌భూపాలపల్లి, కుమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, ‌ములుగు, పెద్దపల్లి, నాగర్‌ ‌కర్నూలు, మహబూబాబాద్‌, ‌రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటలను పేర్కొన్నారు. ఏపీలో హాట్‌ ‌స్పాట్‌ ‌జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్‌. 4 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే హాట్‌స్పాట్‌ ‌నుంచి నాన్‌- ‌హాట్‌స్పాట్‌.. ‌నాన్‌- ‌హాట్‌స్పాట్‌ ‌నుంచి గ్రీన్‌ ‌జోన్‌కు మార్పు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Leave a Reply