Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌బయోలాజికల్‌-ఇ 30 ‌కోట్ల వ్యాక్సిన్‌ ‌డోసులు..!

  • ఆరోగ్య మంత్రిత్వ ఒప్పందం
  • వ్యాక్సిన్‌ ‌పిక్రియలో ఓ ముందడుగు
  • బిఇతో ఒప్పందంతో పెరగనున్న ఉత్పత్తి

న్యూఢిల్లీ,జూన్‌3:‌ భారీ వ్యాక్సినేషన్‌ ‌లక్ష్యంగా భారత్‌ ‌మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ ‌సంస్థకు చెందిన వ్యాక్సిన్లు 30 కోట్ల డోసులను అందించేలా ఒప్పందం కుదుర్చు కుంది. కాగా, ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికీ ట్రయల్‌ ‌దశలో ఉండగా… భారత్‌లో రూపొందిన రెండవ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. గతంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ ‌బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌… ‌మొదటి స్వదేశీ వ్యాక్సిన్‌. 30 ‌కోట్ల డోసులకు గానూ బయోలాజికల్‌ ‌సంస్థకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.1500 కోట్లను అడ్వాన్సుగా చెల్లించనుంది.

ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికే పరీక్షించగా… నేషనల్‌ ఎక్స్‌ఫర్ట్ ఆన్‌ ‌వ్యాక్సిన్‌ అడ్మినిస్టేష్రన్‌ ‌ఫర్‌ ‌కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌-19 (ఎన్‌ఇజివిఎసి) ఆమోదానికి సిఫార్సు చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్లు ఆగష్టు నుండి డిసెంబర్‌ ‌వరకు ఉత్పత్తి, రవాణా జరుగుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌నేపథ్యంలో మోడీ సర్కార్‌ అవలంభించిన వ్యాక్సినేషన్‌ ‌విధానంపై విపక్షాలతో పాటు సుప్రీంకోర్టు సైతం చీవాట్లు పెట్టిన తర్వాత ఈ చర్యలకు ఉపక్రమించింది. అదే విధంగా వ్యాక్సిన్‌ ‌మంత్ర పథకం కింద విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతులను నిలిపివేసింది.

బయోలాజికల్‌-ఇ ‌వ్యాక్సిన్‌ ‌తొలి, రెండవ దశల ఫలితాల పూర్తవ్వగా, ప్రస్తుతం మూడవ దశలో ఉందని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. రానున్న నెలల్లో ఈ వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రానుందని పేర్కొంది. ఆగస్టు నాటికి కోటి మందిని వ్యాక్సినేషన్‌ •‌పక్రియలో భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్‌, ‌సీరమ్‌ ‌నేతృత్వంలోని కోవిషీల్డ్ ‌వినియోగిస్తుండగా…. రష్యా స్పుత్నిక్‌-‌వి అందుబాటులోకి రాగా, విదేశీ సంస్థ ్గఫైజర్‌•, ‌మెడర్నాల నిమిత్తం అక్కడి సంస్థలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. పరిశోధన, అభివృద్ధి, వ్యయం వంటి అంశాల్లో సాయాన్ని అందించడం ద్వారా స్వదేశీ తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో ఇది ఓ భాగమని కేంద్రం పేర్కొంది.

Leave a Reply