Take a fresh look at your lifestyle.

‌ట్రాఫిక్‌ ‌ఫ్రీ నగరంగా హైదరాబాద్‌

  • రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
  • అధికారులతో సక్షలో మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ ‌నగరంలో రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. గ్రేటర్‌ ‌పరిధిలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేంగవంతంగా ముందుకు పోవాలని కెటిఆర్‌ అన్నారు. ఇది వర్కింగ్‌ ‌సీజన్‌ అని ఒక నెల పాటు పనులు చేయవచ్చని అన్నారు. జూన్‌ ‌నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శనివారం బుద్ధభవన్‌లో జీహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ అర్వింద్‌కుమార్‌,‌కమిషనర్‌ ‌డిఎస్‌ ‌లోకేష్‌ ‌కుమార్‌ ‌తో కలిసి హైదరాబాద్‌ ‌రోడ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌కింద చేపట్టిన పనుల ప్రగతిని కేటీఆర్‌ ‌సక్షించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ‌ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

దేశంలో లాక్‌డౌన్‌న చక్కగా వినియోగించుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ మంచి గుర్తింపు పొందిందని అన్నారు. మే నెలలో కొన్ని పనులను ప్రారంభించుకుందామన్నారు. అందుకు అనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలన్నారు. వివిధ ప్యాకేజీల కింద చేటటప్టిన లింక్‌రోడ్లలో అక్కడక్కడ ఆటంకంగా ఉన్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. అలాగే నిర్వాసితులకు ప్రభుత్వపరంగా పునరవాసం కల్పించాలని కేటీఆర్‌ ‌తెలిపారు. జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్‌రోడ్‌ల వెడల్పు 120 అడుగులు ఉండాలని చెప్పారు. భవిష్యత్‌లో ఈ లింక్‌రోడ్ల వల్ల ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎన్‌ఆర్‌డిసి లింక్‌ ‌సర్వీస్‌ ‌రోడ్లను మరింత ప్రయోజనకరంగా రూపొందించేందుకు హెచ్‌ఎం‌డిఏ , ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.

నిర్మాణంలో ఉన్నరైల్వే అండర్‌ ‌పాస్‌లు , రైల్వే ఓవర్‌ ‌బ్రిడ్జిలతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా అవసరమైన భూసేకరణ పక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్‌అధికారును ఆదేశించారు. నిర్మాణ, భూసేకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్‌ ‌రోడ్లలో అక్కడక్కడ అటంకంగా వున్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితు లయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. అటువంటి నిర్వాసితులకు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాలని చెప్పారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్‌ ‌రోడ్ల వెడల్పు 120 అడుగులు వుండాలన్నారు. భవిష్యత్తులో ఈ లింక్‌ ‌రోడ్లు వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్‌ఆర్‌ ‌డిపి, లింక్‌, ‌సర్వీస్‌ ‌రోడ్ల ను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్‌ ఎం‌డిఎ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్‌ అవసరాలు, పెరిగే ట్రాఫిక్‌ ‌రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలని వివరించారు. హైదరాబాద్‌ ‌నగర మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ను అప్డేట్‌ ‌చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. అలాగే నిర్మాణం లో వున్న రైల్వే అండర్‌ ‌పాసులు, రైల్వే ఓవర్‌ ‌బ్రిడ్జి లతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ పక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply