హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేసిన..
67 వేల కోట్లు ఏమైనయో ఆ దేవుడికే తెలియాలి
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
విచారణ జరుపాలని గవర్నర్‌కు ఫోన్
హైద్రాబాద్ అభివృద్ధికి 67 వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా కేటీఆర్ చెప్పారని కానీ 67 వేల కోట్లు ఏమైనయో ఆ దేవుడికే తెలియాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వరదల సహాయక చర్యల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన అంశాలపై చర్చించేందుకు శుక్రవారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, నాయకులు ఫిరోజ్ ఖాన్, బొల్లు కిషన్ తదితరులు సమావేశమై గవర్నర్ తమిళి సైతో ఫోన్లో మాట్లాడారు. వరదలపపైన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం, అక్రమాలపై ఫిర్యాదు చేసి న్యాయ విచారణ జరపాలని కోరారు.
మీడియాతో మాట్లాడుతూ….కెసిఆర్ ఉండే ఇంటికీ కిలో మీటర్ దూరంలో వర్షాలకు అన్ని కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కెసిఆర్ పట్టించుకోవడం లేదని, 550 కోట్లు వరద బాధితులకు ఇస్తామన్నారని, 2 లక్షల బడ్జెట్లో 5 వేల కోట్లు బడ్జెట్ హైదరాబాద్‌కు ఇవ్వ లేరా అని ప్రశ్నించారు. 380 కోట్లు క్యాష్ ఎలా పంపిణీ చేస్తారని కొరోనా సమయంలో 1500 కూడా బాంక్‌లో వేశారని కానీ ఇప్పుడు నగదు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. డబ్బులు డ్రా చేసిన అధికారుల్లో
ఎవరు ఉన్నారో నోట్ చేసుకున్నామని టిఆర్ఎస్కు మేలు చేసేందుకు అధికారులు నగదు రూపంలో ఇచ్చారని, అక్రమాలకు పాల్పడిన వారికి ఎవ్వరినీ వదలమని ఇందులో సిఎస్ సోమేష్ కుమార్‌ను కూడా కూడా వదలమని తెలిపారు. టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి దోచుకుందామనుకున్నావా అని సీఎస్ సోమేష్ కుమార్ అని ప్రశ్నించారు. ఎంత మందికి వరద సహాయం చేశారో లెక్కలు ఇవ్వాలంటే ఇవ్వడం లేదని మండిపడ్డారు.