Take a fresh look at your lifestyle.

నేడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక

  • భారీగా ఏర్పాట్లు..ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభం
  • గ్రామాలకు పోలింగ్‌ ‌సిబ్బంది
  • వరంగల్‌లో ఈటల మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం

దేశం యావత్తూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ‌నేడు జరగనుంది. పోలింగ్‌ ‌నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. శుక్రవారం సిబ్బందికి విధుల కేటాయింపు జరిగింది. ఈవీఎంలతో పోలింగ్‌ ‌కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 306 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేసారు. మొత్తం వోటర్లు 2,37,036 అందులో పురుషులు 1,17,933 మంది, స్త్రీలు 1,19,102 ఉండగా..14 మంది ఎన్‌ఆర్‌ఐ ‌వోటర్లు ఉన్నారు. 306 పోలింగ్‌ ‌కేంద్రాల్లో…306 కంట్రోల్‌ ‌యూనిట్స్‌తో పాటు 612 బ్యాలెట్‌ ‌యూనిట్స్, 306 ‌వివి ఫ్యాట్స్‌ను ఏర్పాటు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వోటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందోనన్న ఆసక్తి కనిపిస్తుంది. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు వోటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

డబ్బులు విచ్చలవిడిగా పంపంకం చేశారు. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతుందని స్థానికులు చెప్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు మోహరించాయి. వారం రోజుల క్రితం రెండు సీఏపీఎఫ్‌ ‌కంపెనీలు కేంద్రం నుంచి దిగాయి. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కంపెనీలతో కవాత్‌లు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పోటాపోటీగా తీసుకోవడంతో హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులందరూ ఇక్కడి నుంచి వెళ్లారు. గురువారం 18 కేంద్ర కంపెనీల బలగాలు దిగాయి. శుక్రవారం నుంచి అన్ని గ్రామాల్లోని పోలింగ్‌ ‌కేంద్రాలకు తరలి వెళ్లారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడగా నేడు ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభం కానుంది. నవంబర్‌ 2‌న వోట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం..రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది.

వరంగల్‌లో ఈటల మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం
వరంగల్‌లో ఈటల రాజేందర్‌ ‌వి•డియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హోటల్‌ ‌గ్రాండ్‌ ‌గాయత్రిలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ విలేఖరుల సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈటలను హోటల్‌ ‌లోపలికి రాకుండా ఏసీపీ గిరి కుమార్‌, ‌పోలీసులు రోడ్డు వి•దే అడ్డుకున్నారు. బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను వారించి రాజేందర్‌ను బీజేపీ నేత వివేక్‌ ‌వెంకటస్వామి, రావు పద్మ తదితరులు హోటల్‌ ‌లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈటల భావోద్వేగానికి లోనయ్యారు.

‘ప్రజలతో 19ఏళ్ల బంధం నాది. చంపుకుంటరో-సాదుకుంటరో వి•కిష్టం నేను చచ్చినా బతికినా వి•వెంటే’ అని ఆవేదన చెందారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మరికొద్ది గంటల్లో జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌  ‌వరంగల్‌కు చేరుకున్నాక పోలీసులు అడ్డుకోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

Leave a Reply