Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్‌

‌రాజకీయ పార్టీలకు సంకేతాలు
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఏ ‌క్షణమైనా వొచ్చే అవకాశం ఉంది. వొచ్చే నెలలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలకు ఇప్పటికే సంకేతాలు అందినట్టు తెలుస్త్తుంది. రెండు, మూడ్రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్‌ ‌విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడే ఉప ఎన్నికకు సిద్ధంగా లేమని సీఈసీకి కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌లేఖ రాసింది. అయితే దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. వొచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌ అలెర్ట్ అయ్యాయి. హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాల్లో కేసీఆర్‌ ‌బిజీ బిజీగా ఉన్నారు.

Leave a Reply