Take a fresh look at your lifestyle.

హుస్నాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరు

Husnabad Municipal Election

  • పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్న ఎమ్మెల్యే వొడితల
  • 19న మంత్రి హరీష్‌రావు పర్యటన
  • ఇప్పటికే 2స్థానాలు ఏకగ్రీవం
  • గెలుపు ధీమాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

హుస్నాబాద్‌, ‌జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి) : పట్టణంలో గులాబీ దండు కదం తొక్కుతోంది. ఎటు చూసి నా గులాబీ సైన్యాలే కనిపిస్తున్నాయి. వార్‌ ‌వన్‌ ‌సైడే అనే విధంగా టీఆరెస్‌ ‌శ్రేణులు పని చేస్తున్నాయి. ఎన్నికలకు మరో ఐదు రోజులే సమయం ఉన్నందున గులాబీ దండు ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌నాయకత్వంలో మొత్త స్థానాలు స్వీప్‌ ‌చేసే దిశగా వ్యూహ రచన చేస్తున్నారు. ప్రతి వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.

వార్డుల వారిగా ఇంచార్జులు
మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సమన్వయం చేసేందుకు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వార్డుల వారిగా ఇంచార్జులను నియ మించారు. ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.ప్రతి వార్డులోనూ విన్నూత్నగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్థిస్తు న్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌జెడ్పీ చైర్మన్‌ ‌డా. ఎం. సుధీర్‌ ‌కుమార్‌ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రచార సరళిని తెలుసుకున్నారు.

19 న మత్రి హరీష్‌ ‌రావు ప్రచారం
ఈ నెల 19 న రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌ ‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించను న్నారు. పట్టణంలో ఆయా వార్డుల్లో, ముఖ్య కూడళ్లలో రోడ్‌ ‌షో నిర్వహించనున్నారు. హరీష్‌ ‌రావు ప్రచారంతో టీఆరె•ఎస్‌• ‌పార్టీకి మరింత ఊపు రానుంది. అభ్యర్థుల్లో, శ్రేణుల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. మొత్తం స్థానాలు స్వీప్‌ ‌చేసే దిశగా టీఆర్‌ఎస్‌ ‌వ్యూహ రచన చేస్తోంది.

ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌ప్రత్యేక దృష్టి
అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు ఎమ్మెల్యే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. టికెట్ల కేటాయిపులో ఎవరినీ నొప్పించకుండా.. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి తన మార్క్ ‌ప్రదర్శించారు. ఇటు ఇంటెలిజెన్స్ ‌నివేదికలు, అటు పార్టీ అంతర్గత నివేదికలు, మరో వైపు ప్రత్యేకంగా మరో టీమ్‌ను నియమించి ఎన్నికలపై సర్వే నిర్వహించారు. సామాజిక సమతుల్యాన్ని అభ్యర్థుల ఎంపిక సందర్భంగా పాటించారు. నిజానికి ఒక్క టీఆరెస్‌ ‌పార్టీలోనే టికెట్ల కోసం భారీ గా ఆశవహులు పోటీపడ్డారు. ప్రధాన ప్రతిపక్షాల్లో టికెట్లు తీసుకునే వారే లేకపోవడంతో నామ్‌ ‌కే వాస్తే, బలవంతంగా పోటీలో నిలిపారే తప్ప వారిలో ఆ ఉత్సాహం కానరావడం లేదు.

అభివృద్దే ఎజెండా..
హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా వొడితల సతీష్‌ ‌కుమార్‌ 2014 ‌లో గెలిచిన అనంతరం హుస్నాబాద్‌ ‌పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరపంచాయతీగా ఉన్న హుస్నాబాద్‌ ‌మున్సి పాలిటీ గా అప్‌ ‌గ్రేడ్‌ అయింది. పట్టణంలో అతి ముఖ్య సమస్యలుగా ఉన్న బై పాస్‌ ‌రోడ్‌, ‌డిపోరోడ్‌ ‌లను మంత్రి హరీష్‌ ‌రావు సహకారంతో వేసారు. అలాగే గత ముప్పై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని ఎల్లమ్మ చెరువుకు కూడా మరమత్తులు చేసారు. పట్టణంలో అన్ని వీధులను సీసీ రోడ్లుగా మార్చారు. మొన్నటి వేసవిలో మిషన్‌ ‌భగీరథ నీళ్లు కూడా ఇంటింటీకీ వచ్చాయి. గతంలో కరవుతో కనీసం తాగునీటికి అల్లాడిన హుస్నాబాద్‌ ‌నీటి కరువు ప్రస్తుతం లేదనే చెప్పాలి. విద్యాభివృద్ది కోసం పాలిటెక్నిక్‌ ‌కాలేజీ ఏర్పాటు చేసారు. సమీకృత కార్యాలయాల భవన సముదా యం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ళ నిర్మాణం కూడా ముగింపు దశకు చేరుకుంది. హుస్నాబాద్‌ ‌రెవిన్యూ డివిజన్‌ ‌గా ఏర్పాటైంది. పోలీసు సబ్‌ ‌డివిజన్‌ ఏర్పాటైంది.

సంక్షేమం జోరు..
పట్టణంలో దాదాపు మూడువేల మందికి వృద్దాప్య, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళల, గీతకర్మిక, నేత, బీడి కార్మికుల పింఛన్లు ప్రతినెలా వస్తున్నాయి. ఇటీవల ఇవి రెట్టింపు కూడా అయ్యాయి. వందలాది మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా రుణాలు అందాయి. పట్టణానికి చెందిన చాలా మంది నిరుపేద విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారు. ఆయా వార్డుల్లో టీఆరెస్‌ ‌పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులు సంక్షేమ పథకాల లబ్దిదారులను ఇంటింటికీ తిగిరి కలుస్తూ కారు గుర్తుకు టీఆరెస్‌కు వోటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నా రు. దీనికి లబ్ది దారుల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది. గతంలో గొర్రెల పెంపకందారులకు, మత్స్య కార్మికులకు కూడా పట్టణంలో లబ్ది చేకూరింది. వారంతా టీఆరెస్‌ ‌పార్టీకే వోటు వేస్తామని ధీమాగా చెప్తున్నారు.

విద్యావంతులు టీఆరెస్‌ ‌వైపే..
పట్టణంలోని విద్యావంతులు రాజకీయాలకు అతీతంగా టీఆరెస్‌ ‌పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌సౌమ్యులని, ఏ సమస్య ఉన్న్నా స్పందిస్తున్నారని, ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో పెండింగ్‌ ‌లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కృషి చేసారని మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని గౌరవెళ్లికి తీసుకువచ్చే పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయని, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయితే హుస్నాబాద్‌ ‌నియోజకవర్గానికే తాగునీటి ఎద్దడి ఉండదని విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు చెప్తున్నారు. అభివృద్ది కి ఏళ్లకేళ్లు దూరంగా ఉన్న హుస్నాబాద్‌ ‌రూపు రేఖలు మార్చివేస్తున్న ఘనత ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌కు దక్కుతుందని వారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆరెస్‌ అధికారంలో ఉందని, అలాగే నియోజకవర్గానికి ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్నారని, సిద్దిపేట జిల్లా సీ ఎం జిల్లా అని, మంత్రి హరీష్‌ ‌రావు కూడా సిద్దిపేట జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున హుస్నాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో టీఆరెస్‌ అభ్యర్థులను గెలిపించుకుని బహుమతిగా ఇవ్వాలని, తద్వారా హుస్నాబాద్‌ ‌కు మరిన్ని నిధులు భవిష్యత్లో తీసుకువచ్చి మరింత అభివృద్ది చేసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.

Tags: usnabad municipal, elections 2020, trs party contestants, congress party

Leave a Reply