Take a fresh look at your lifestyle.

హుస్నాబాద్‌ ‌తుపాకుల మాయం కేసులో.. సిఐ సహా 5గురు సస్పెన్షన్‌

మాయమైన తుపాకుల కేసులో సిఐ సహా ఐదుగురిపై వేటు పడింది. హుస్నాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో తుపాకుల అపహారణ కేసులో పోలీస్‌ ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఓ సిఐ సహా, మరో ఐదుగురిని బాధ్యులుగా చేస్తూ సస్పెన్షన్‌ ‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్లితే…గత నెలలో అక్కన్నపేటకు చెందిన సదానందం గోడ విషయంలో పక్కింటికి చెందిన గంగరాజుపై కాల్పులు జరపిన విషయం విధితమే. సదానందం ఫైరింగ్‌ ‌చేయడంతో హుస్నాబాద్‌లో మాయమైన ఆయుధాల విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గోడ నిర్మాణం విషయం వచ్చిన తగాదాలో సదానందం తన ఇంటి పక్కన ఉన్నవారిపై కాల్పులు జరపడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఓ ఏకె 47, ఎస్‌ఎల్‌ఆర్‌ ‌తుపాకులు, కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, సదానందంను కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసు అధికారులు అతని నుండి పూర్తి వివరాలు రాబట్టారు. స్టేషన్‌ ‌నుండే తాను తుపాకులు ఎత్తుకెళ్లానని చెప్పడంతో అప్పుడు హుస్నాబాద్‌ ‌స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిఐ సంజయ్‌(‌ప్రస్తుతం సిఐడి విభాగంలో పని చేస్తున్నారు).తుపాకులు మాయమైప్పుడు సంజయ్‌ ‌హుస్నాబాద్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆయనతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌. ‌సంపత్‌, అక్కన్నపేట ఏఎస్‌ఐ ‌మణెమ్మ, గన్నేరువరం పిఎస్‌ ‌హెడ్‌కానిస్టేబుల్‌ ‌మనోజ్‌, ‌హుస్నాబాద్‌ ‌కానిస్టేబుల్‌ అశోక్‌ను సస్పెన్షన్‌ను చేస్తూ పోలీస్‌ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులను జారీ చేశారు. ఇదిలా ఉంటే, హుస్నాబాద్‌ ‌స్టేషన్‌ ‌నుంచి 2016లో కనిపించకుండా పోయిన ఏకే 47పై అప్పటి పోలీసుల దర్యాప్తు తీరుపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పటి అధికారులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. అపహరణకు గురైన తుపాకులకు సంబంధించి సినిమా తరహాలో ట్విస్టుల మీద ట్విస్టులు. చిట్ట చివరకు కాల్పులు జరిపిన సదానందంను పోలీస్‌లు తమదైన శైలిలో విచారణ జరపగా…తుపాకులు మాయం గురించి పూసగుచ్చినట్లు వివరించడంతో…2016లో మాయమైన తుపాకులు..సదానందం వద్ద ఉన్న ఆయుధం ఒక్కటేననీ ఇన్విస్టిగేషన్‌ ‌పోలీసులు నిర్దారణకు వచ్చి…ఇదే విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులకు నివేదికను పంపడంతో…పోలీస్‌ ఉన్నతాధికారులు ఎట్టకేలకు 2016లో హుస్నాబాద్‌లో మాయమైన ఆయుధాలకు సం•ంధించి ఐదుగురిని బాధ్యులుగా చేస్తూ వేటు వేసింది. మొత్తానికి హుస్నాబాద్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో అపహరణకు గురైన ఆయుధాల కేసు ఇలా ముగిసిందన్నమాట!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy