Take a fresh look at your lifestyle.

ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసిన యువకుడు భర్త ఇంటి ముందు భార్య ధర్నా

ప్రజాతంత్ర  (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని  అన్నారం గ్రామంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువతిని మోసం చేసినా యువకుడు అయితే భర్త భార్యను వద్దని అనడంతో  భార్య  భర్త  కోసం అతని ఇంటి ముందు ధర్నా చేపట్టింది అదే గ్రామానికి చెందిన పూజ,అదే గ్రామానికి చెందిన గోపాల్ అనే ఇద్దరు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు అనంతరం యువతికి కుటుంబ సభ్యులు మరోక్కరితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలోనే యువతికి పెళ్లి చేస్తారన్న విషయం తెలుసుకున్న గోపాల్ ఖచ్చితంగా యువతిని పెళ్లి చెసుకుంటానని చెప్పి గత, మే 20వ తేదీన  పెళ్ళి చేసుకున్నరు అనంతరం షాద్ నగర్ పోలీసులను ఆశ్రయించారు ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులను సముదాయించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అయితె ఈ మధ్య కాలంలో ఘర్షణలు ప్రారంభం కావడంతో  ప్రస్తుతం భర్త భార్యను వద్దని అంటున్నడాని  భార్య భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది తనకు న్యాయం చేయాలని కోరుకుంటుంది.

Leave a Reply