నిర్లక్ష్య వృక్షపు నీడన..
విజయ హరితం ఎదగదు
నిరాశ మబ్బులు కమ్మిన..
కనిపించవు ఆశల వెలుగులు !
కష్టాల చెమట చుక్కల్తో..
చిగురించు సుఖ మొలకలు
చదువు పట్టాల పంట చేనులో..
పండును జీవన సాఫల్య రాసులు !
పేదోడి ఆకలి కసి కృషి..
వర్షింపజేయు అన్నామతాన్ని
అక్షరాల్ని విశ్వసించే మనిషి..
విశ్వవిజేతై ధరించు కీర్తి కిరీటం !
ఓటమి పొందిన ప్రయత్నం
మంచు పొర కప్పిన పర్వతం
మసకబారిన మనో మందిరం
నేడోరేపో చిమ్మును వెలుగులు !
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగరం – 9949700037