Take a fresh look at your lifestyle.

ఆర్థిక సంస్కరణల పితామహునికి వందేళ్లు

“పీవీ ప్రధాని ఐన తరువాత 1991 నూతనపారిశ్రామిక విధానాన్ని రూపొందించి, అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్‌ ‌సింగ్‌కు పూర్తిస్వేచ్ఛను కల్పించాడు. ఈ నూతన విధానంలో ప్రభుత్వరంగపాత్ర నిర్వీర్యం, పారిశ్రామిక లైసెన్సింగ్‌ ‌పద్ధతి తొలగింపు, ఏకస్వామ్యని యంత్రణ చట్టంలో సవరణలు, పారిశ్రామిక స్థల నిర్ణయ విధాన సరళీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, లాంటి సంస్కరణలకు నాంది పలుకడం ద్వారా బహుళజాతి సంస్థలలో ఉపాధికల్పన, మెరుగైనజీవన ప్రమాణ స్థాయి, పరిశోధన అభివృద్ధి లాంటి ఫలితాలు రాబట్టడం జరిగింది.”
బహు భాషాకోవిదుడు, అపరచాణక్యుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, పాత్రికేయుడు, సాహితీవేత్త, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒడిదొడుకులు లేకుండా పూర్తి కాలంపాటు నడిపిన ఘనుడు, ఎల్పీజి సృష్టి కర్త, ఇలా ఎన్నో పేర్లు సొంతం చేసుకున్న మన తెలుగుబిడ్డ పాముల పర్తి వెంకట నరసింహరావు (పీవీ). వరంగల్‌ ‌జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్‌ 28‌న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు జన్మించాడు. వరంగల్‌ ‌జిల్ల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్‌ ‌జిల్లా భీమదేవరపల్లి, మండలం వంగర గ్రామానికి చెందిన పాముల పర్తిరంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడం జరిగింది. ఇతని విద్యాభ్యాసం ఉస్మానియా యూనివర్సిటీ మరియు నాగపూర్‌ ‌విశ్వవిద్యాలయంలో కొనసాగింది. రాష్ట్ర రాజకీయాల్లో పీవీ 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఇదే నియోజక వర్గం నుండి వరుసగా నాలుగుసార్లు శాస•నసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 నుంచి 1971 మధ్య కాలంలో వివిధశాఖలలో మంత్రిగా పనిచేయడం జరిగింది.వివాదాల జోలికి పొని తన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని అతని రాజకీయ నేపథ్యం తనకు 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయని చెప్పవచ్చు.
ముఖ్యమంత్రిగా పీవీ:
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలు పరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుక బడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో ముల్కి నిబంధనలపై సుప్రీమ్‌కోర్టు ఇచ్చిన తీర్పుతో కోస్తా, రాయలసీమ ప్రాంతం జై ఆంధ్ర ఉద్యమం చేపట్టి, నాయకులూ రాజీనామాలు చేయటంతో 1973 లో కొత్త మంత్రులతో మంత్రివర్గ ఏర్పాటు జరగటం, కానీ అధిష్టానం భిన్న ఆలోచనతో మరునాడే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతిపాలన విధించటంతో పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసిపోయింది.
ప్రధానమంత్రిగా పీవీ :
రాష్ట్రంలో లాగానే కేంద్రంలో కూడా కఠిన పరిస్థితులను ఎదుర్కున్నాడు పీవీ. 1991  సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా రాజకీయ సన్యాసం తీసుకున్నవేళ, ఆకస్మికంగా రాజీవగాంధీ హత్యకు గురికావడం, అప్పుడు అధిష్టానానికి నమ్మిన వ్యక్తి లేకపోవడం, తనకున్న మంచి పేరుతో ప్రధానమంత్రి పదవికి అవకాశాలు సృష్టించబడ్డాయి. దానికి నంద్యాల ఉపఎన్నికలో బరిలోకి దిగడం, ఎన్టీ రామారావు సాటి తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడని తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దింపలేదు. అయితే కేంద్రంలో సంపూర ్ణమెజారిటీ రాకపోయినా తనకున్న రాజకీయ చతురతతో మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపిన ఏకైక ప్రధాని మనతెలుగు బిడ్డ.అందుకే తనను అపరచాణక్యుడు అని పిలిచేవారు.
ఆర్థిక సంస్కరణలు :
భారతదేశం స్వాతంత్రం సాధించిన తరువాత మిగతా దేశాలవలె మనం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో  1948 మరియు 1956  పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది.వీటిలో ప్రభుత్వరంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగగా ఈ• •ండూ విధానాలు సత్ఫలితాలివ్వ లేదు. పీవీ ప్రధాని ఐన తరువాత 1991 నూతనపారిశ్రామిక విధానాన్ని రూపొందించి, అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్‌ ‌సింగ్‌కు పూర్తిస్వేచ్ఛను కల్పించాడు. ఈ నూతన విధానంలో ప్రభుత్వరంగపాత్ర నిర్వీర్యం, పారిశ్రామిక లైసెన్సింగ్‌ ‌పద్ధతి తొలగింపు, ఏకస్వామ్యని యంత్రణ చట్టంలో సవరణలు, పారిశ్రామిక స్థల నిర్ణయ విధాన సరళీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, లాంటి సంస్కరణలకు నాంది పలుకడం ద్వారా బహుళజాతి సంస్థలలో ఉపాధికల్పన, మెరుగైనజీవన ప్రమాణ స్థాయి, పరిశోధన అభివృద్ధి లాంటి ఫలితాలు రాబట్టడం జరిగింది. ఈ రోజు ఆర్థిక వ్యవస ్థఈ మాత్రమైనా దృఢ•ంగా ఉందంటే ఆ రోజు ఈయన చేసిన సంస్కరణలే అని చెప్పవచ్చు.
సాహితీకృషి :
రాజకీయాల్లో తనకు ఏమాత్రం తీరిక లేకున్న సాహిత్యంపై తనకున్న మక్కువతో, ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన రచనలుచేసే వాడు. పైగా తనకు 17 భాషలలో ప్రావిణ్యం ఉండడంతో బహుభాషా కోవిదుడిగా పేరొందాడు. సహస్రఫణ్‌, అబల జీవితం, ఇన్సైడర్‌ ‌మొదలగు రచనలు చేశాడు.ఈ విధంగా రాష్ట్ర రాజకీయాలు వడ్డించిన విస్తరాకులాగా లేనప్పటికీ తనవద్ద ఉన్న సకల అస్త్రాలను మరియు కళానైపుణ్యాలను ఉపయోగించి రాజకీయాలనే కాదు దేశస్థితి గతులనే మార్చిన బాహుబలి మన పీవీ అని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు. తానుబ్రతికున్నపుడు అతనిపై నిందలు వేసారు చనిపోయాక రాజకీయం చేసారు కనీసం ఇప్పటికైనా తాను చేసిన కృషికి భారతరత్న పురస్కారం ఇచ్చి తన ఆత్మకు శాంతి కలిగించాలని వంగర వాసిగా మనవి.
image.png
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్ 9492791387

Leave a Reply