వనపర్తి,మే,19(ప్రజాతంత్ర విలేకరి) : పొట్టకూటి కోసం కోటు కష్టాలు పడుతు బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రం నుండి వలస వచ్చిన ఒక జంట లేబర్ మేస్త్రీ మాయమాటలు నమ్మి మోసపోయి ఆసుపత్రి పాలయిన సంఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులను తమ పిల్లలను వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఘంట ఊరు గ్రామానికి చెందిన శ్యామల నరేష్ దంపతులు గుత్తేదారు గణేష్ అనే వ్యక్తి ఉచ్చులో పడి మోసపోయారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో తనకున్న బాతులను మోపడానికి ఇద్దరికి కలిపి నెలకు 10వేల రూ. జీతం ఇస్తానని చెప్పి అడ్వాన్సు సైతం ఇవ్వకుండా తీసుకొచ్చినట్లు గత నాలుగు నెలల నుండి పని చేయించుకొని చిల్లి గవ్వ ఇవ్వకుండా రోడ్డు పై వదిలేసి గుత్తేదారు ముఖం చాటేశాడని వారు చెప్పారు. నరేశు తన భార్య అనారోగ్యం బారిన పడడంతో వనపర్తి ఆసుపత్రిలో చేర్పించా రు. చేతులో డబ్బులు లేక తినడానికి తిండి లేక గుత్తేదారు గణేశుకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వస్తుందని చెప్పారు.
కన్నీరుమున్నీరుగా రోధిస్తు ఉండడంతో అటుగా వెళ్తున్న వారు పట్టణ ఎస్సైకి విషయాన్ని అందించారు. దీంతో పట్టణ ఎస్సై వెంకటేష్‌గౌడ్ 5వేల రూ. రూరల్ ఎస్సై షేక్ షఫీ వేయ్యి రూ. కౌన్సిలర్ బ్రహ్మాచారి 2500రూ. బిజెపి నారాయణ 2వేలు బిజెపి కౌన్సిలర్ పద్మా పరుశురాం 2వేలు, జనతా ల్యాబ్ రాహుల్ వెయ్యి రూ. అంబులెన్సు రఘు 2వేలు వారి సహకారంతో అందజేశారు. ఇలాంటి సంఘటన మరెవ్వరికి జరగరాదని పోలీసులు పేర్కొన్నారు.