Take a fresh look at your lifestyle.

శవాల మెడలో మానవత్వం

ప్రాణాలతో చెలగాటం
వెంటిలేటర్‌ ‌కుంపట్లకు
అందని ప్రాణవాయువు

మొదటి వేవ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌
‌దండిగ దాడి చేస్తున్న క్రిమి
దాగని దాగుడు మూతలు

ముందస్తు లేని ప్రణాళికలు
మొండి జగమొండి వాదనలు
ప్రమాదపుటంచుల్లో ప్రజారోగ్యం

కోరలు చాచిన కొరోనా
శవాసనాలతో ఆసుపత్రులు
బారులు తీరిన శవాలు

రాజ్యమేలుతున్న వైద్యం
చోద్యం చూస్తున్న పాలకవర్గం
పాలనలో అంతా స్మశాన వైరాగ్యం

పుట్టలు పుట్టలుగా
కుప్పలుతెప్పలుగా
పేరుకుపోయిన సమస్యలు

ప్రశ్నకు లేదు స్వేచ్ఛ
దరిదాపుల్లోకి రాని జవాబు
ప్రశ్నకు జవాబుకు దొరకని వారధి

స్మశాన వాటికలకు
క్యూ కట్టిన ప్రాణంలేని దేహాలు
శవాల మెడకు వేళ్ళాడుతున్న మానవత్వం
– కట్టెకోల చిన నరసయ్య, 9951260316

Leave a Reply