Take a fresh look at your lifestyle.

సంక్షోభంలో మానవ హక్కులు…

1948 డిసెంబర్‌ 10‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ విశ్వమానవ హక్కుల తీర్మానాన్ని ఆమోదించి అమలు ఆరంభమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం పరిపాటి.ప్రతి మానవుడు గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తూ కనీస సౌకర్యాలు కలిగి ఉండడం హక్కుగా కలిగి ఉండాలని విశ్వమానవ హక్కుల ప్రకటన నిర్దేశిస్తోంది.అయితే హక్కులు లేని బాధ్యతలు ఆరాచకత్వానికి సూచికలుగా నిలుస్తాయి.నేడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుగుతున్న తరుణంలో ప్రజల యొక్క హక్కులు ఏ రకంగా రక్షించబడ్డాయో,ఆ హక్కుల్ని కాపాడుకొని తమ పౌరుల్ని కాచుకోవాల్సిన ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమైయ్యాయో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది.
ప్రపంచాన్ని దాదాపు ఏడాది కాలం నుంచి కరోనా రూపంలో వణికిస్తున్న ఆరోగ్య సంక్షోభం మనం నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు, గుణపాఠాలు మన ముందు ంచింది. సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో మేటి అడుగులు వేసి వైద్యరంగంలో అద్భు తమైన ప్రగతి సాధించిన పశ్చిమ దేశాలు కరోనా బారినుంచి తమ పౌరుల్ని కాపాడు కోవడంలో ఘోరంగా విఫలమై పౌరుల హక్కు అయిన ఆరోగ్యకరమైన జీవితాన్ని రక్షించడంలో వెనకబడిన విషయాన్ని ఎక్కిరిస్తూ ఉన్నాయి.పౌరులు ఆరోగ్య వంతమైన జీవితాన్ని కొనసాగించడానికి వీలుగా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సరైన ముందస్తు ప్రణాళిక లోపమే ఈ వైఫల్యాలకి కారణమన్నది సుస్పష్టం. విద్యా, వైద్యం, మంచినీరు, పరిశుభ్రమైన పరిసరాలు వంటి అంశాలు అన్ని కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా కనీస మానవ హక్కులుగా వివిధ ప్రభుత్వాల చేత గుర్తింపబడి అమలు చేయబడుతూ ఉన్నాయి.ఐక్యరాజ్య సమితి నిర్ధేశించిన పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా విద్యా, వైద్యం, పరిశుభ్రమైన వాతావరణం వంటి అంశాలు ఉన్నాయి.కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 220 మిలియన్ల మంది కార్మికులు తమ యొక్క ఉపాధిని కోల్పోయినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల్లో తేలింది.కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు, గని కార్మికులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడి దయనీయమైన పరిస్థితి సంభవించి మానవ హక్కుల అంశం ప్రశ్నార్ధకంగా మారింది.కోట్ల మంది బడి ఈడు పిల్లలు కరోనా కారణంగా బడి బయట ఉంటూ తమ యొక్క చదువులకు దూరమైన పరిస్థితి మనం చూసాం.
భారతదేశంలో విద్యను ప్రాధమిక హక్కుగా భారత రాజ్యాంగంలో 2002లో చేర్చడం జరిగింది.ఆరు నుంచి పధ్నాలుగేళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను 86వ రాజ్యాంగ సవరణతో భారత రాజ్యాంగం నిర్ధేశిస్తుంది. బాలబాలికలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు అయిన విద్య వివిధ సౌకర్యాలు లేకపోవడంతో బాలలు చదువుకు నోచుకోక రకరకాల అవస్థలు పడ్డారు, కంప్యూటర్‌,‌సెల్‌ ‌ఫోన్‌, ‌టెలివిజన్‌ ‌వంటి సౌకర్యాల లేమి బాలల పాలిట శాపంగా మారి కరోనా కాలంలో విద్యాహక్కుని హరించింది. ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు రోడ్లపై నడుస్తూ ఆకలి దప్పుల మధ్య అల్లాడిన హృదయ విదారక దృశ్యాలెన్నో కరోనా కాలంలో కనిపించాయి. ఒక వ్యవస్థలో ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగి ంచగలిగిన నాడే నిజమైన విశ్వ మానవ కళ్యాణం అనే పదానికి సార్ధకత.
పిల్లుట్ల నాగఫణి,జర్నలిజం కాకతీయ విశ్వవిద్యాలయం.8074022846.

Leave a Reply