Take a fresh look at your lifestyle.

కర్నూలులో మానవ హక్కుల కమిషన్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ‌సీతారామమూర్తి

కర్నూలు,సెప్టెంబర్‌ 1 :  ‌కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ‌కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ఎం.‌సీతారామ మూర్తి బుధవారం ప్రారంభించారు. కర్నూలులను రెండో రాజధానిని చేయడం, ఇక్కడ హైకోర్టు కూడా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది ఈ క్రమంలో ఇక్కడ హెచ్చార్సీ కార్యాలయం ప్రారంభం అయ్యింది.

అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్‌ ‌గెస్ట్ ‌హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌నేపథ్యంలో ఆన్‌లైన్‌ ‌ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply