Take a fresh look at your lifestyle.

రియల్ టైం డాష్ బోర్డు ఏర్పాటు చేయాలి

కొరోనా కట్టడికి మానవ హక్కుల సంఘం మార్గదర్శకాలు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ .మే 11: దేశంలో కొరోనా కల్లోలం నెలకొన్న నేపథ్యంలో కొరోనా కట్టడి పై జాతీయ మానవ హక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాధ్యతగా వ్యవహరిస్తూ రియల్ టైం డాష్ బోర్డు ఏర్పాటు చేయాలి అని జాతీయ మానవ హక్కుల సంఘం అదేశాలు ఇచ్చింది.ఇలా ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో ఆసుపత్రులు, ఆక్సిజన్, ఐ సి యు బెడ్లు, మందులు, యంత్రాల వివరాలు ప్రజలకి తెలిసేలాగా ఉంచాలి అని జాతీయ మానవ హక్కుల సంఘం చెప్పింది.

ఆక్సిజన్ సిలిండర్లు, మందులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా రోగులకు ఉచితంగా గా వైద్యం అందించాలి అని కేంద్ర రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేయాలని, అందరికీ టీకాలు అందేలాగా చర్యలు తీసుకోవాలి అని, స్మశాన వాటికలలో మౌలిక వసతులను మెరుగుపరచాలి అని, కరోనా ఫ్రాంట్ లైన్ యోధుల రక్షణకు చర్యలు తీసుకోవాలి అని, నిత్యవసర వస్తువులు అమ్మే వేళలను ఇంకా తగ్గించాలి అని, జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఈ సూచనలపై తీసుకున్న చర్యలను నాలుగు వారాల్లో జాతీయ మానవ హక్కుల సంఘంకు నివేదించాలని కేంద్ర రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశలను జారీ చేసింది.

Leave a Reply