- పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు
- లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు
- రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆర్టీవో ఎర్రి స్వామి, డీఎస్పీ మోహన్‌రెడ్డి
అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కల్గిఉంటే ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని జిల్లా రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతా వారోత్సవాల పై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఆర్టీవో ఎర్రి స్వామి మాట్లాడుతూ పిల్లలకు వాహనాలు ఇవ్వడం సరికాదని అన్నారు.18 ఏళ్ల వయస్సులో వాహనాలు ఇస్తే తెలిసి తెలియని తనంతో ప్రమాదాలకు కారణమవుతున్నారని తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు లైసెన్స్ వచ్చేదాక వాహనాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. తల్లిదండ్రులు లైసెన్స్ రాక ముందు పిల్లలకు వాహనాలు ఇస్తే తండ్రులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించి వాహనం నడిపినా, త్వరగా వెళ్లాలనే ఆత్రు తతో వేగంగా వెళ్లినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున గమ్యం కన్నా ప్రాణం విలువైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వాహనచో దకులు జాగ్రత్తగా వాహనాలు నడిపితే పూర్తి స్థాయిలో ఇది సాధ్యమ వుతుందన్నారు. దేశంలో సగటున 1.50లక్షల ప్రమాదాలు జరుగుతున్న కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం మూలంగా ఆయా కుటుంబాలు పూర్తిగా అగాథంలో మునిగి పోతున్నాయని అన్నారు.కారు నడిపే వారు సీటు బెల్ట్, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ విధిగా ధరించి వాహనాలు నడపాలని మీరంతా మీ తల్లిదండ్రులకు సూచనలుచేయాలని సూచించారు. మనం నిబంధనలను అతిక్రమిస్తే ఎదుటి వారికి ఇబ్బందులు కల్గుతాయనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు.
నాగర్ కర్నూల్ డిఎస్పి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాహన దారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. డ్రంక్అండ్ డ్రైవ్, సెల్ఫోన్లతోనే అధిక ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ల ద్వారానే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. అవగాహన సదస్సుతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించి మార్పుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కువగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసుకుని వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలు సైతం తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీఏ అధికారులు, పోలీస్ అధికారులు, గీతాంజలి పాఠశాల యాజమాన్యం నరేష్, ప్రిన్సిపాల్ జోసెఫ్ రాయ్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Rto Erri Swamy, DSP Mohan Reddy,Human mistakes,cause road accidents