Take a fresh look at your lifestyle.

రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు …!

నియామకాల కోసం ఆశావాహుల ఎదురుచూపులు
150 ‌మండలాలలో ఇంచార్జ్ ‌తహసిల్దార్‌ల విధుల నిర్వహణతో పాలన కుంటుపడిందన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి.గత రెండేళ్లుగా డిప్యూటీ తహసిల్దార్‌లకు.. తహసిల్దార్‌గా ప్రభుత్వం పదోన్నతులు కల్పించ లేదు. 8 రెవిన్యూ డివిజన్‌లలో ఆర్డీవో పోస్టులు ఖాళీలు, డిప్యూటీ కలెక్టర్‌ ‌పోస్ట్‌లు 40 వరకు ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది..భూ పరిపాలన స్తంభించి పోతుంది.

గ్రామీణ ప్రాంతాలలో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగినా సిబ్బంది లేకపోవడంతో ప్రజలు విసుగు చెందుతున్నారు. రెవిన్యూ శాఖ ప్రక్షాళన తప్ప ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా నిలిచిపోయిన డిప్యూటీ తాసిల్దారు పదోన్నతులపై ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పదోన్నతులు కల్పించకుండా దాటవేత ధోరణి కనిపిస్తుందని..రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి  డిప్యూటీ తహసిల్దార్‌లకు, తహసిల్దార్‌లకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply