Take a fresh look at your lifestyle.

‘‌భారత్‌ ‌మాతాకి జై’…మారుమ్రోగిన భదాద్రి

75 మీటర్ల త్రివర్ణ పతాకంతో 10 వేల మందితో భారీ ర్యాలీ

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : 75 సంవత్సరాల స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రజలు ప్రతీరోజు ర్యాలీ నిర్వహిస్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు కాలేజీ గ్రౌండ్‌ ‌నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌మీదుగా బ్రిడ్జి సెంటర్‌ ‌వద్దకు నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్‌ ‌నుండి అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌మీదుగా కాలేజి గ్రౌండ్‌కి ర్యాలీ వెళ్ళింది. ఈ ర్యాలీని భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో భద్రాచలం పట్టణంలో ఉన్న వివిధ శాఖల అధికారులు, ప్రధానంగా పోలీస్‌ ‌శాఖ, సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు ఈ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. 200 మీటర్ల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. చర్ల రోడ్డు నుండి ప్రారంభమైన 200 మీటర్ల జెండాను వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో పాటు పట్టణ ప్రజలు, ప్రముఖులు జెండాను ఎంతో పవిత్రంగా పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌మీదుగా కాలేజీ గ్రౌండ్‌ ‌వద్దకు చేరుకున్నారు.

10వేల మందితో నిర్వహించిన ర్యాలీలో ‘భారత్‌ ‌మాతాకి జై’ అంటూ ప్రజలు నినాదాలు చేయటంతో భద్రాచలం పట్టణం మారుమ్రోగింది. యావత్‌ ‌భదాద్రి ప్రజలు జెండా చేత పట్టుకుని దేశ భక్తిని చాటుకున్నారు.అలాగే ట్రైకలర్‌ ‌బెలూన్‌లను ఆకాశంలోకి వదిలారు.200 మీటర్ల జెండాను ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌ ‌విద్యార్ధినీలు పట్టుకుని వెళ్ళటం పలువురిని ఆకర్షించింది.   వివిధ స్వఛ్చంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ ర్యాలీలో రెవెన్యూశాఖతో పాటు వివిధ శాఖలు,పట్టణ సిఐ నాగరాజు రెడ్డితో పాటు పోలీస్‌ ‌సిబ్బంది, సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గా ప్రసాద్‌, ‌బోగాల శ్రీనివాసరెడ్డి, సరెళ్ళ నరేష్‌, ఎస్‌కె అజీమ్‌, ‌బుడగం శ్రీనివాస్‌, ‌చారుగుళ్ళ శ్రీనివాస్‌ ‌మరియు వివిధ పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

రామాలయం ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకంతో గిరి ప్రదక్షణ, ర్యాలీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం వైధిక కమిటి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకంతో గిరి ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం అర్చకులు దేవస్థానం సిబ్బంది జాతీయ జెండాలతో రామాలయం నుండి తాతగుడి సెంటర్‌ ‌వరకు ర్యాలీ నిర్వహించారు. అర్చకులు భారత్‌ ‌మాతాకి జై అంటూ నినాదాలు చేసారు.

Leave a Reply