Take a fresh look at your lifestyle.

రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

Huge Pilgrims in Rajanna's vicinity

సిరిసిల్ల: మేడారం సమ్మక్క,సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో వేము)వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది.ఈ సోమవారం సందర్భంగా 60 వేలకు పైగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయ ప్రాంగణం,మేన్‌రోడ్డు,బద్దిపోచమ్మ వీధి,భీమేశ్వరాలయం వీధులు కిక్కిరిసిపోయాయి.చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికిని వేలాది భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి,శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి, కోడె మొక్కులను చెల్లించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.

ఈ రద్దీని గమనించి,ఆలయంలోని మహామండపంలో లఘుదర్శనాన్ని అమలు చేసి,శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులను త్వరితగతిన బయటకు పంపించారు.ఈ రద్దీతో దేవస్థానానికి రూ 30 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని సిబ్బంది వెల్లడించారు.కాగా మరో రెండు రోజుల నుండి దేవస్థానానికి భక్తుల వరద మరింత పెరిగే అవకాశం ఉంది.దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బందికి తగిన ఆదేశాలను జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ రద్దీ కారణంగా వేములవాడ మేన్‌బస్‌స్టేషన్‌లో బస్సుల నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలను ఆర్టీసి అధికారులు తీసుకుంటున్నారు.

Leave a Reply