Take a fresh look at your lifestyle.

వరదతో రూ.వేల కోట్ల నష్టం…

  • కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు
  • రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అంచనా
  • ఆర్థిక పరిస్థితిపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
  • వరదసాయం అందించడంలో కేంద్రం విఫలం
  • పెద్ద ఉపద్రవం వచ్చినా ముందుకు రాని కేంద్రం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌
కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే తప్ప రాష్ట్రాలకు అవసరమైనప్పుడు సాయం అందించదనే విషయం మరోసారి రుజువై•ందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రూ.వేల కోట్లలో పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ ‌నగరానికి నష్టం జరిగినా కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శనివారం ప్రగతి భవన్‌లో ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో  ఉన్నత స్థాయి సవి•క్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ వరద సాయంపై ప్రస్తావన వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలో వరదలు ముంచెత్తాయి. దీనివల్ల అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు రూ.5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని సీఎం కేసీఆర్‌. ‌ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీకి అక్టోబర్‌ 15‌న లేఖ రాశారు.  వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దిగ్భ్రాతి కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’ అని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.52,750 కోట్ల లోటు
కొరోనా ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బ్జడెట్‌ అం‌చనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు కొరోనా వల్ల రాష్టాన్రికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ ‌నుంచి అక్టోబర్‌ ‌వరకు ఏడు నెలల కాలంలో రాష్టాన్రికి 39,608 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ ‌వరకు రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020-21 బ్జడెట్‌ ‌ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ, కొరోనా వల్ల పెరగాల్సిన 15 శాతం పెరగక పోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్టాన్రికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం 67,608 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనాతో బ్జడెట్‌ ‌ప్రతిపాదనలు రూపొందాయి. కానీ కేవలం రూ.33,704 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.33,904 కోట్లు తగ్గనుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బ్జడెట్లో పేర్కొన్నారు.

 

Leave a Reply