Take a fresh look at your lifestyle.

శ్రీ‌శైలం ఎడమగట్టు విద్యుత్‌ ‌కేంద్రంలో.. భారీ అగ్ని ప్రమాదం

  • భూగర్భంలో చిక్కుకుపోయిన సిబ్బంది 9 మంది మృతి
  • షార్ట్ ‌సర్క్యూట్‌తో దట్టంగా అలుముకున్న పొగలు
  • మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి, జెన్‌•కో సిఎండి ప్రభాకర్‌రావుల పర్యవేక్షణలో సహాయకచర్యలు
  • గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి
  • సిఐడి విచారణకు ఆదేశించిన సిఎం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్‌ ‌కేంద్రంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా విద్యుత్‌ ‌కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి. షార్ట్ ‌సర్క్యూట్‌ ‌వల్లనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మొత్తం 24 మంది లోపల ఉండగా 15మంది బయటకు వచ్చారు. 9 మంది సిబ్బంది విద్యుత్‌ ‌కేంద్రంలోనే చిక్కుకుపోవడంతో పోవడంతో అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. పొగ దట్టంగా అలముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు లోపలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. బయటకు వచ్చిన వారిలో గాయపడ్డ వారిని సున్నిపెంట హాస్పిటల్‌కు తరలించారు. శ్రీశైలం ఎడమ గట్టు
విద్యుత్‌ ‌తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో హైవోల్టేజ్‌ ‌టార్చ్‌లు వేసినప్పటికీ పొగ వల్ల పది అడుగుల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 44వ ఫైర్‌ ‌క్యాబిన్‌ ‌వద్ద ఫైర్‌ ‌సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో ఆరు యూనిట్లలోని ప్యానెల్స్ ‌దగ్ధమయ్యాయి.

విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌ ‌రావు, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌శర్మన్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవైక్షించారు. జల విద్యుత్‌ ‌కేంద్ర నుంచి 15మంది సురక్షితంగా బయటకు రాగా 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్‌ ‌పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్‌ ‌రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు సింగరేణి సిబ్బంది సాయం కోరినట్లు ఆయన చెప్పారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్‌ ‌కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వివరించినట్లు జెన్‌కో  సీఎండీ ప్రభాకార్‌రావు తెలిపారు. గురువారం రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని, 1200 కేవీ ఐసోలేట్‌ ‌చేసినట్లు సీఎండీ తెలిపారు.  షాట్‌ ‌సర్క్యూట్‌ ‌కారణంగా విద్యుత్‌ ‌తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. వీరి ఫోన్లు గంటపాటు పని చేసినా తరువాత స్పందించకపోవడంతో సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. జల విద్యుత్‌ ‌కేంద్రంలో భారీగా పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది రంగంలోకి దిగారు.

లోపల చిక్కుకుపోయిన సిబ్బంది 9 మంది మృతి
అగ్ని ప్రమాదం దుర్ఘటనలో లోపల చిక్కుకుపోయిన మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. తొలుత రెస్క్యూ బృందం మూడో ప్లోర్‌లో ఏఈ సుందర్‌ ‌నాయక్‌ (35) ‌మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్‌తో పాటు మరో ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించింది. ఏఈ సుందర్‌తో పాటు మోహన్‌ ‌మృత దేహాలను బయటకు తరలించారు. మృతులలో ఒరరైన సుందర్‌ ‌నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో సుందర్‌ ‌నాయక్‌ ‌సొంతూరుకు వచ్చి 15 రోజులు •మ్‌ ‌క్వారెంటైన్‌లో ఉండి కొరోనాను జయించారు. గురువారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్‌ ‌కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్‌ అసిస్టెంట్‌ ‌రిజిస్ట్రార్‌గా పనిచేశారు. విద్యుత్‌ ‌కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్‌ ‌పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్‌ ‌రెడ్డి తెలిపారు.

  • గవర్నర్‌ ‌తమిళిసై, సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి
  • సిఐడి విచారణకు ఆదేశించిన సిఎం

శ్రీశైలం పవర్‌ ‌ప్లాంటులో జరిగిన ప్రమాదంపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌, ‌ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్వక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్‌ ‌ఘటనపై మంత్రి జగదీష్‌ ‌రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సిఎం కెసిఆర్‌ ‌ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్‌ ‌డీజీపీ గోవింద్‌ ‌సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శ్రీశైలంలోని  జల విద్యుత్‌ ‌కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనపై మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎం‌పీలు మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి, పోతుగంటి రాములు దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఘటనలో  9 మంది చిక్కుకోవడం దురదృష్టకరమని, వారు క్షేమంగా బయటకు రావాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

Leave a Reply