Take a fresh look at your lifestyle.

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  • అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌
  • ‌విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు
  • నైట్‌ ‌ఫ్రాంక: కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

‌నగరంలో వర్షాలు, వరదలను తట్టుకునేలా నాలాల అభివృద్ధి చేపడుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. కొరోనా నియంత్రణలో ఇతర రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా ఉన్నామని తెలిపారు. వరల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌క్యాపిటల్‌గా, బల్క్ ‌డ్రగ్‌ ‌ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉన్నామన్నారు. అమెజాన్‌, ‌గూగుల్‌ ‌వంటి అంతర్జాతీయ సంస్థలకు నగరంలో కార్యాలయాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో ఇండ్లు, స్థలాల ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్‌ ‌తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు.

ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్‌ ‌ఫ్రాంక్‌ ‌కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. నైట్‌ ‌ఫ్రాంక్‌ ‌హైదరాబాద్‌ ‌స్పెషల్‌ ‌రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్‌ ‌విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేశ్‌ ‌రంజన్‌తో పాటు నైట్‌ ‌ఫ్రాంక్‌ ఇం‌డియా లీడర్‌షిప్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..రియల్‌ ఎస్టేట్‌ ‌సర్వేలో నైట్‌ ‌ఫ్రాంక్‌ ఇం‌డియా ప్రసిద్ధిగాంచిందని కేటీఆర్‌ ‌తెలిపారు. అమెజాన్‌, ‌గూగుల్‌ ‌వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఆఫీసులు ప్రారంభించాయి. ఇండ్లు, స్థలాల ధరలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. హైదరాబాద్‌లో హెల్త్ ‌కేర్‌, ‌వైద్య, విద్యా రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply