Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పెనుమార్పులు

“తెరాస ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇవ్వడం వల్ల ఉత్పత్తులు బాగా పెరిగాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే దేశంలో ప్రతి ఎనిమిది కోడిగుడ్లలో ఒక గుడ్డు తెలంగాణాలో ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర కోళ్ళ పరిశ్రమ దేశంలో మూడవ స్థానాన్ని అధిష్టించింది. 2019-20లో తెలంగాణా వేసవి కాలం వరకూ 330 కోట్ల కోడిగుడ్లను ఉత్పత్తి చేసింది.  తెలంగాణ  వ్యవసాయ, అనుబంధ రంగాల ముఖ చిత్రం 2019-20లో పూర్తిగా మారిపోయింది.”

రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సంప్రదాయ వ్యవసాయ విధానాల్లో పెనుమార్పులు వొచ్చాయి. పశుగణాభివృద్ధిపై రైతులు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇవ్వడం వల్ల ఉత్పత్తులు బాగా పెరిగాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే దేశంలో ప్రతి ఎనిమిది కోడిగుడ్లలో ఒక గుడ్డు తెలంగాణాలో ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర కోళ్ళ పరిశ్రమ దేశంలో మూడవ స్థానాన్ని అధిష్టించింది. 2019-20లో తెలంగాణా వేసవి కాలం వరకూ 330 కోట్ల కోడిగుడ్లను ఉత్పత్తి చేసింది.  తెలంగాణ  వ్యవసాయ, అనుబంధ రంగాల ముఖ చిత్రం 2019-20లో పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ అంశం స్పష్టం అవుతోంది. సంప్రదాయక విధానాలపై  రైతులు ఆధారపడటం తగ్గించారు. పశుగణాభివృద్ధి వల్ల లాభాలు ఎక్కువ వస్తున్నాయని  రైతులు సంబరపడుతున్నారు.

ఇది వాస్తవం.   తెలంగాణ పశుగణాభివృద్ధి శాఖ వల్ల 25.82 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 66,403 కోట్ల విలువ అన్న మాట. రైతులు పాడిపరిశ్రమకు తోడు కోళ్ళు, గొర్రెలు, ఇతర జంతుజాలాలను పెంచుకుని జీవనం సాగిస్తున్నారు.  స్టేట్‌ ‌గ్రాస్‌ ‌డొమెస్టిక్‌ ‌ప్రాడెక్టు(2019-20)లో బాగా పెరిగింది. పశుగణాభివృద్దిలో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలుస్తోంది.  తెలంగాణ గొర్రెల పెంపకంలో అగ్ర స్థానంలో  ఉంది. గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలుస్తోంది. దేశంలో వినియోగమయ్యే  ప్రతి ఎనిమిదవ గుడ్డు తెలంగాణాలోనే ఉత్పత్తి  అవుతోంది. కొత్త ధోరణి గ్రాస్‌ ‌వాల్యూయాడెడ్‌ 2019-20‌లో 6.9 శాతం దాటింది. పశుగణాభివృద్ధి  7.6 శాతంతో తొలిసారి పశుగణాభివృద్ధిలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది. పశుగణాభివృద్ధి      ద్వారా ఆదాయం పంటలకన్నా ఎక్కువ వస్తోంది. పంటల ద్వారా 6.9 శాతం మాత్రమే వస్తుండగా, పశుగణాభివృద్ధి ద్వారా 7.6 శాతం వస్తోంది. 2011-12లో వేసిన అంచనాకన్నా కూడా పశుగణాభివృద్ధి ద్వారా రాష్ట్రానికి  ఆదాయం బాగా వచ్చింది.

అలాగే, చెరువుల్లో చేపల పెంపకం ద్వారా ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించారు.  అసలు  ధరలో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా  ఇస్తోంది. లబ్ధిదారు 25 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు ఎక్కువ లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేయకుండా స్థానికంగా వాటి ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన  గొర్రెల సబ్సిడీ పథకం సత్ఫలితాలను ఇస్తోంది.  కర్నాటక, తమిళనాడు తర్వాత  తెలంగాణ  మూడవ స్థానంలో నిలిచింది. అలాగే, మత్స్యకార పరిశ్రమ వల్ల 27.14 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 3.12 లక్షల మంది మత్స్యకార మహిళలు   ఈరంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇన్‌ ‌లాండ్‌ ‌ఫిషింగ్‌లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నీటి వనరులు బాగా పెరిగాయి. రాష్ట్రంలో 24,189 నీటి  కుంటలు, చెరువులు  ఉన్నా,  5.72  హెక్టార్లలో  ఇవి విస్తరించి  ఉన్నాయి.  4, 452 మత్సకార సొసైటీలు పని చేస్తున్నాయి, వీటిలో  3,08, 370 మంది సభ్యులు  ఉన్నారు.  మొత్తం మీద రైతులు వ్యవసాయేతర రంగాలపై  ఆధారపడేందుకు  అనువైన పరిస్థితులు  రాష్ట్రంలో నెలకొన్నాయి.  తెరాస ప్రభుత్వం  అధికారంలోకి  వచ్చిన తర్వాత వచ్చిన మార్పు  ఇది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్.

Leave a Reply