Take a fresh look at your lifestyle.

భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించండి: సిపి

trainy ips, giriraju, west zone dgp

భూకబ్జాలకు పాల్పడే వారిపై పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని లేనియెడల అట్టి అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌వి.రవీందర్‌ అన్నారు. గురువారం కమిషనరేట్‌లో నెలవారి నేర సమీక్షా సమా వేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపాల్టీ ఎన్ని కలను సజావుగా నిర్వహించడంలో విధులు నిర్వహించిన పోలీసులను అభినందించారు. పోలీ• •స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదులు ఇచ్చే ప్రతీ ఫిర్యాదుకి తప్పక రశీదు అందజేయడంతో పాటు చట్టాలను అనుసరించి కేసు నమోదు చేయాలని సూచించారు.

 

ప్రజలతో మమేకమైనప్పుడే నేరాలు నియంత్రించగలుగుతామని అలా ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. మేడారం జాతర ట్రాఫిక్‌ ‌బందోబస్తు ఏర్పాట్లపై కమిషనర్‌ ‌ప్రస్తావిస్తూ కమిషనరేట్‌ ‌పరిధిలోని రోడ్డు మార్గం నుండి మేడారంకు తరలివెళ్ళే వాహనాలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలన్నారు. ప్రతీ 5కిలోమీటర్ల పరిధిలో ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమైన కూడళ్ళ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ ‌సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఈస్ట్, ‌వెస్ట్ ‌జోన్‌ ‌డిసిపిలు నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనీ ఐపిఎస్‌ ‌యోగేష్‌గౌతమ్‌, అదనపు డిసిపిలు మల్లారెడ్డి, భీంరావు, గిరిరాజుతో పాటు ఏసిపిలు, ఇన్సిపెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags: trainy ips, giriraju, west zone dgp

Leave a Reply