Take a fresh look at your lifestyle.

పొద్దెరెగక పాటుపడే ఇంజినీరింగ్‌ ‌టీచర్స్ ‌కష్టాలు తీరేదెలా?

” అనుబంధ యూనివర్సిటీ అధికారులు అధికారికంగా ఇచ్చిన లెక్క ప్రకారం  వడపోత కాగా మిగిలిన కాలేజీల్లో  ఫాకల్టీ సంఖ్య 86778. యూనివర్సిటీ వడపోతలు, తనిఖీ వల్ల కొంతయినా అసలైన ఫాకల్టీకి మంచి జరిగిందనే చెప్పాలి. అయితే అన్ని నియామక ప్రక్రియలకూ నిలిచి ఎంపికై కళాశాలల్లో పని చేసే అధ్యాపకుల బాగోగులు పట్టించుకునే నాధుడే లేడు. ఒక్కొక్క ఇంజనీరింగ్‌  ‌కాలేజీలో ఫాకల్టీ చేసే పనులు పర్శీలిస్తే విస్తుపోతాం.   పేరుకు వృత్తి అధ్యాపకులైనా చేసేది బండచాకిరి. గత రెండు సంవత్సరాలుగా సకాలంలో జీతాలు ఇవ్వక,  ఇచ్చేదీ సరిగా ఇవ్వక పోవడంతో గూడు, గుండె చెదిరి ఆత్మహత్యలు చేసుకున్న గురువులెందరో..  అయితే, ముక్కుతూ ములుగుతూ జీతాలిస్తున్న   యాజమాన్యాలకు కరోనా కలిసొచ్చింది. కరోనా పేరుచెప్పి ఉన్న జీతం ఎగ్గొట్టిన సంస్ఠలెన్నోఉన్నాయి.  ఉద్యాగాలూడిపోవడంతో బ్రతుకు తెరువు కోసం ఇడ్లి బండ్లు, చెప్పుల దుకాణాలు పెట్టుకొని కుటుంబాలు పోషించుకుంటున్న అధ్యాపకుల గురించి ప్రతిరోజు మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం.”

ప్రస్తుత కాలంలోఎన్నో విలక్షణమైన విద్యావకాశాలు ఉన్నా అందరూ అభిమానించేదీ, కోరుకునేదీ, జీవితానికి భరోసా ఇచ్చేదీ అది ఒక్కతే. అదే ఇంజినీరింగ్‌ ‌కోర్సు. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌ ‌లో ఇంజనీరింగ్‌ ‌కోర్సుకు మరింత ప్రాధాన్యత, డిమాండ్‌ ‌పెరిగింది. ఎంత డిమాండ్‌ ఉన్నా అభ్యసించాలంటే  నాణ్యత, సొమ్మూ అవసరం. కాస్తోకూస్తో కాసులుంటే తప్ప ఇంజనీరింగ్‌ ‌విద్య సాధ్యం కాదు. ఇదే అదునుగా ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలుచేసి డబ్బు సపాదన ధ్యేయంగా వసూలుచేసే ఇంజనీరింగ్‌ ‌కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎ ఐ సి టి ఇ  ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చిన కారణంగా  యాజమాన్యాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో, అర్హతకలిగిన ఫాకల్టీ లేకున్నా కోర్సులు ప్రారంభించాయి. రోజువారీ అరువు, అద్దె ప్రాతిపదికపై తెచ్చుకుని అధికారులకు లంచాలతో చేతులు తడిపి తనిఖీ ముగించి విశ్వవిద్యాలయాల అనుమతులు పొందాయి. కళాశాలల్లో అంతర్గత వ్యవస్థీకృత  అస్తవ్యస్తం అయింది.
రియల్‌ ఎస్టేట్‌, ‌మద్యం వ్యాపారులు, బడా రాజకీయ నాయకులూ  ఇంజనీరింగ్‌ ‌విద్యను చేజిక్కించుని ఆటలాడుతున్నారు.  గతంలో వేళ్ళపైలెక్కించే సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్‌ ‌కళాశాలల సంఖ్య ఉమ్మడి రాష్ట్రం లో అయిదు వందలకు పైగా పెరగడంతో లక్షలాది ఇంజనీరింగ్‌ ‌సీట్లు  అందుబాటులోకి వచ్చాయి. ఫీజు రీఇంబర్స్మెంట్‌ ‌పుణ్యమా అని ఇంటికి ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌పట్టబద్రులు తయారయ్యారు. ఫీజు రీఇంబర్సుమెంట్‌ ‌కోసమే వెలిసిన ఈ కాలేజీ ల్లో ప్రత్యక్షంగా పరోక్షన్గా వేలమంది ఇంజనీరింగ్‌ అర్హతకల నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు లభించాయి.
దాదాపు దశాబ్ద కాలం ఏ అడ్డు అదుపు, కనీస వసతులు, నాణ్యమైన విద్య  బోధించే అర్హులైన అధ్యాపకులు లేకుండా నిరుద్యోగ ఇంజినీర్లను సృష్టించిన ఫ్యాక్టరీలుగా కళాశాలలు తయారయ్యాయి. అయితే ప్రతి సందర్భంలో కొందరు అనుభవజ్ఞులైన నిజాయితీ పరులైన ఫాకల్టీ సభ్యుల చొరవ కొంతమేరకు వెలకట్టలేనిది. తెలంగాణ ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రే 2015 మార్చ్ 11‌న అసెంబ్లీ లో ఇంజనీరింగ్‌ ‌విద్యావ్యవస్థపై అసహనం వక్తం చేసి కళాశాల యజమాన్యాలపై  కొరడా ఝళిపించించి, శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. విజిలెన్సు దాడులు ముమ్మరం చేసారు. కంగుతిన్న యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాయి. ప్పటివరకూ నిద్రమత్తులో ఉన్న అధికారులు యూనివర్సిటీ ప్రతినిధులు సంస్కరణల దిశగా అడుగులేశారు. మొదటగా వారు నిరంతరం కష్టపడే ఫాకల్టీపై  క్రమశిక్షణ  చర్యలకు  ఉపక్రమించారు. ఇంజినీరింగ్‌ ‌ఫాకల్టీ టీచింగ్‌ ‌పనులే కాకుండా సంస్థ పాలనా విభాగాంలో చేసే పనే ఎక్కువ. ఆక్రెడషన్‌ ‌పనుల్లో టార్గెట్‌ ‌విధులతో డాక్యూ మెంటేషన్‌ ‌తో ఉక్కిరి బిక్కిరి అవు తుంటారు.  కచ్చితమైన తనిఖీలు నిర్వహించి తరువాత వడపోతలో తేలిన కాలేజీలు ఇప్పుడు 176. మాయమైన యాజమాన్యాలు పోగొట్టు కున్నది ఏమీలేదు కానీ, క్పంత నష్టపోయింది మాత్రం ఆ కాలేజీల్లోని అధ్యాపకులే.
అనుబంధ యూనివర్సిటీ అధికారులు అది •కారికంగా ఇచ్చిన లెక్క ప్రకారం  వడపోత కాగా మిగిలిన కాలేజీల్లో  ఫాకల్టీ సంఖ్య 86778. యూనివర్సిటీ వడపోతలు, తనిఖీ వల్ల కొంతయినా అసలైన ఫాకల్టీకి మంచి జరిగిందనే చెప్పాలి. అయితే అన్ని నియామక ప్రక్రియలకూ నిలిచి ఎంపికై కళాశాలల్లో పని చేసే అధ్యాపకుల బాగోగులు పట్టించుకునే నాధుడే లేడు. ఒక్కొక్క ఇంజనీరింగ్‌  ‌కాలేజీలో ఫాకల్టీ చేసే పనులు పర్శీలిస్తే విస్తుపోతాం.   పేరుకు వృత్తి అధ్యాపకులైనా చేసేది బండచాకిరి. గత రెండు సంవత్సరాలుగా సకాలంలో జీతాలు ఇవ్వక,  ఇచ్చేదీ సరిగా ఇవ్వక పోవడంతో గూడు, గుండె చెదిరి ఆత్మహత్యలు చేసుకున్న గురువులెందరో..  అయితే, ముక్కుతూ ములుగుతూ జీతాలిస్తున్న   యాజమాన్యాలకు కరోనా కలిసొచ్చింది. కరోనా పేరుచెప్పి ఉన్న జీతం ఎగ్గొట్టిన సంస్ఠలెన్నోఉన్నాయి.  ఉద్యాగాలూడిపోవడంతో బ్రతుకు తెరువు కోసం ఇడ్లి బండ్లు, చెప్పుల దుకాణాలు పెట్టుకొని కుటుంబాలు పోషించుకుంటున్న అధ్యాపకుల గురించి ప్రతిరోజు మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం.
గుండెల్లో అసంతృప్తి ఉన్నా ఏనాడూ విద్యార్హులకు అన్యాయం చేయక కొరోనా కాలంలో ఆన్లైన్‌ ‌క్లాస్‌ ‌లతో పిలిస్తే పలికినపుణ్యమూర్తులు ఈ అధ్యాపకులు. కొరోనా విపత్తుతో  ముందు నోటీసు లు లేకుండా ఆన్లైన్‌ ‌పేరిట ఒక సబ్జెక్టుకు ఒక ఫాకల్టీ అంటూ పలువురు ఫాకల్టీ ని తొలగించాయి యాజమాన్యాలు. యూనివర్సిటీ అధికారులకు మొరపెట్టుకున్నా ఉపాధ్యాయ సంఘాలు  ఉద్యమాలు చేస్తున్నా, వారిపై కేసులు పెట్టడం మినహా న్యాయం జరగలేదు. పరిశ్రమల్లోనో, భవన నిర్మాణ కార్మికులలో వర్తించే చట్టాలు న్యాయాలు  వీరి విషయంలో నిర్వీర్యం అయ్యాయి.

అనుబంధ యూనివర్సిటీల గ్రేవియన్స్ ‌విభాగానికి ఎన్నిసార్లు  మొరపెట్టుకున్నా ఇంగినీరిన్గ్ ‌కాలేజీల పై ఎలాంటి చర్యలులేవు.   కనీసం అధ్యాపకులను పిలిచి వారి బాధలు తెలుసుకునే ప్రయత్నమూ లేదు. 45 నెంబర్‌ ‌జి.ఓ. ఎక్కడా అమలులేదు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే ఏసెలవులూ అమలు జరగట్లేదు.  ఇక్కడకూడా సమిధలు ఫ్యాకల్టియే. ప్రభుత్వం దగ్గర పేరుకుపోయిన ఫీజు రేలింబ్స్మ్రెంట్‌ ‌వెంటనే మంజూరు చెయ్యకుంటే జీతాలు ఇవ్వలేము అని యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ప్రభుత్వం తక్షణం ఒక రెగ్యులేటరీ విధానం రూపొందించి అనుబంధ కాలేజిల్లో పనిచేసే అధ్యాపకులను ఆదుకునే చట్టాలు రూపొందించాలని ఉపాద్యాలు సంఘాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. అన్ని ప్రభుత్వ కొలిజిల్లో ఉన్న సీట్లు ఒక్క ప్రయివేట్‌  ‌విద్య సంస్థలో ఉన్నాయంటే పరిస్థితి ఏ దిశలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. తక్షణం ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి అవసరమైన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప రాబోయే విపత్తు అధిగమించలేం.
డా: కృష్ణ సామల్లబీ
సీనియర్‌ ‌ప్రొఫెసర్‌ ఇన్‌ ఇం‌జినీరింగ్‌ (9705890045)

Leave a Reply