Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేదెలా ?

‌”డ్రవింగ్‌ ‌లైసెన్సు జారీచేసేటప్పుడు చట్టాలపై అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రత అధికారులు రోడ్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలి. ప్రధాన కూడలివద్ద జీబ్రా క్రాసింగ్‌, ‌ట్రాఫిక్‌ ‌సిగ్నల్స్ ‌పనిచేసేలా చూస్తుండాలి. జాతీయ రహదారులపై ప్రమాద హెచ్చరిక బోర్డులను అమర్చాలి. ప్రభుత్వ యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తూ, చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారులున్న గ్రామాల వద్ద ప్రత్యేకంగా లింక్‌ ‌రోడ్లు ఏర్పాటు చేసి తగినసూచనలివ్వాలి. విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను ప్రత్యేక పాఠాలుగా ప్రవేశపెట్టాలి. రహదారుల వెంట, ప్రత్యేక అంబులెన్స్ ‌సమకూర్చాలి. మద్యం సేవించి వాహనం నడిపే వారి లైసెన్స్  ‌రద్దుచేయాలి.”

వరుస ప్రమాదాలతో రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం నిత్యకృత్యం. ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్‌ ‌నిర్లక్ష్యం వల్ల బ్రతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నది. 2019లో రోడ్డు ప్రమాదాల్లో 6,964 మంది మృతిచెందగా, 21,999 మంది గాయపడ్డారు. 2020 జూన్‌ 30 ‌నాటికి రాష్ట్రంలో 8,712 రోడ్డు ప్రమాదాలు జరిగి 2,595 మంది చనిపోతే 9,173 మంది గాయపడ్డారు. ఈ ఏడాది కరోనా మృతులకంటే రోడ్డు మరణాలే ఎక్కువగా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదాలు అజాగ్రత్త, మద్యం మత్తు, అతివేగం, శీతాకాలంలో మంచు వలన రహదారులు కనబడకపోవడం, నిద్రమత్తు, వాహనం సాంకేతిక లోపాలు ప్రమాదాలకు కారణం. చిత్ర పరిశ్రమ ప్రముఖుల కుమారులు, రాజకీయ నాయకుల సంతానం రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు చర్చ జరిగి, ప్రమాదాన్ని అరికట్టే చర్యలను తెలిపేవారు. కానీ ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఒక్కొక్కసారి అమాయక పాదాచారుల ప్రాణాలు వాహనాలకు బలైపోవడం మరింత విచారం. ఆటోలో పదిమంది, మోటార్‌ ‌సైకిలు, స్కూటర్లపై పలువురు ప్రయాణించడం, హెల్మెట్‌, ‌సీట్‌ ‌బెల్ట్ ‌పెట్టుకోకపోవడం, రోడ్డుభద్రత నియమాలు పాటించకపోవడం, వలన ప్రమాదాలకు గురై ఎంతోమంది మరణిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎవరైనా ఇలాంటి ప్రమాదాల బారినపడి మరణిస్తే దిక్కు కోల్పోయి, ఆ కుటుంబం అంతా రోడ్డున పడాల్సిన పనవుతుంది. రోడ్డు ప్రమాదాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి కారణాలు అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాహనదారులు కూడా బాధ్యులే. ప్రతికుటుంబంలో ఏదో ఒక వాహనం అవసరమైన పరిస్థితి. ఆర్థిక స్తోమత కనుగుణంగా ద్విచక్ర మోటార్‌ ‌వాహనాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. అనుకోకుండా వాహనంలో ఏర్పదే సమస్యలు వలన కొన్ని ప్రమాదాలు జరిగితే, ఒక్కొక్కసారి ఎదుటి వాహనం అజాగ్రత్త వలన ప్రాణాలు పోతాయి. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల, రాజకీయ నాయకుల సంతానం రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు చర్చ జరిపి ప్రమాదాలు అరికట్టే చర్యలను తెలిపేవారు. కానీ కొన్నాళ్ళకు మామూలే.. ఇంటినుండి బయలుదేరి సాయంకాలం ఇంటికెళ్ళేదాకా జీవితానికి భద్రత లేకుండా పోయింది. కేవలం వాహనాదారులే గాకుండా ఒక్కొక్కసారి అమాయక పాదచారుల ప్రాణాలు సైతం బలైపోవడం తెలిసిందే. ఆటోలో పదిమంది ఎక్కడం, మోటార్‌ ‌సైకిళ్ళపై పలువురు ప్రయాణించడం, హెల్మెట్‌, ‌సీట్‌ ‌బెల్ట్ ‌పెట్టుకోక పోవడం, మొబైల్‌ ‌మాట్లాడుతూ వాహనం నడపడం వలన ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనేది నిర్వివాదాంశం.

ప్రమాదాలు విశాలమైన నాలుగు మార్గాల రోడ్డు, ఔటర్‌ ‌రింగు రోడ్డులపై జరుగుతుంటాయి. అతివేగంతో వెళ్లి, రెప్పపాటు క్షణంలో నియంత్రణ కోల్పోయి, ప్రాణాలను కోల్పోయే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు వేగంతో పాటు, ఫోన్లల్లో మాట్లాడుకుంటూ డ్రై చెయ్యడం, మద్యం సేవించి నడిపడం వలన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయినవారు అత్యధికం యువతే. వ్యసనాలకు అలవాటు పడటం ముఖ్య కారణం. కార్లు అతివేగంగా ప్రయాణించడం, ఆసమయంలో సేఫ్టీ ఫీచర్స్ ‌పనిచేయకపోవడం ప్రామాదాలకు కారణం. ప్రయాణ సమయంలో గుండెపోటు, రక్తపోటు రావడం, మానసిక ఆందోళనలు ప్రమాదాలకు ఇతర హేతువులు. రోడ్డు భద్రత అధికారులు సరైన సమయంలో స్పదించకపోవడం వలన కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలను అరికట్టడానికి చట్టాలను కఠినంగా అమలు చేయాలి. డ్రవింగ్‌ ‌లైసెన్సు జారీచేసేటప్పుడు చట్టాలపై అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రత అధికారులు రోడ్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలి. ప్రధాన కూడలివద్ద జీబ్రా క్రాసింగ్‌, ‌ట్రాఫిక్‌ ‌సిగ్నల్స్ ‌పనిచేసేలా చూస్తుండాలి. జాతీయ రహదారులపై ప్రమాద హెచ్చరిక బోర్డులను అమర్చాలి. ప్రభుత్వ యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తూ, చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారులున్న గ్రామాల వద్ద ప్రత్యేకంగా లింక్‌ ‌రోడ్లు ఏర్పాటు చేసి తగినసూచనలివ్వాలి. విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను ప్రత్యేక పాఠాలుగా ప్రవేశపెట్టాలి. రహదారుల వెంట, ప్రత్యేక అంబులెన్స్ ‌సమకూర్చాలి. మద్యం సేవించి వాహనం నడిపే వారి లైసెన్స్ ‌రద్దుచేయాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రమాదాల నివారణకోసం జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్‌ ‌సేఫ్టీ పోలీస్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సూచనమేరకు ప్రతిపాదనలు రూపొందించి 70 పోలీస్‌ ‌స్టేషన్ల ఆవశ్యకతను గుర్తించారు. అవసరమైన వాహనాల కొనుగోలు. లేజర్‌ ‌గన్స్, ‌స్పీడ్‌ ‌గన్స్, ‌బ్రీత్‌ ఎనలైజర్‌, ‌ఫస్ట్ ఎయిడ్‌ ‌వైద్యం సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు చేశారు. అయితే ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. 22 రీజనల్‌ ‌కార్యాలయాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి 1800 కిలోమీటర్లకు ఒక డివిజన్‌ ‌కార్యాలయం, 900 కిలోమీటర్లకు ఒకగ్రూపు కార్యాలయం, 600 కిలోమీటర్ల పరిధిలో సబ్‌ ‌గ్రూపు కార్యాలయం, ప్రతి 300 కిలోమీటర్ల దూరంలో ఫీల్డ్ ఆఫీసర్‌ ‌వుండేలా ప్రతిపాదనలు చేశారు కానీ.. ఫలితం శూన్యం.

 డా. పోలం సైదులు ముదిరాజ్‌,   9441930361
డా. పోలం సైదులు ముదిరాజ్‌,
9441930361

Leave a Reply