Take a fresh look at your lifestyle.

గంజాయి బానిసత్వం నుండి బయట పడడమెలా…

“కొందరు యువకులు ఈ మత్తుకు అలవాటుపడతారు. వారు అక్కడితో ఆగకుండా పక్కవారిని చెడగొట్టేందుకు ఆ మత్తులో ఉండే ఆనందాన్ని రెట్టింపు చేసి చెబుతారు. అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే నెపంతో గంజాయి అలవాటుకు బానిసవుతున్నారు యువకులు. మద్యంతో వచ్చే మత్తుకంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందని, అదో కొత్త కిక్కు అంటూ కొత్తవారిని అటువైపు తీసుకెళ్తుంటారు బానిసలు. గంజాయి సేవిస్తే అదనపు మత్తు ఉంటుందనే భావన యువకుల్లో ఉంది. అదే భావనతో వారు బానిసలయ్యే ప్రమాదం ఉంది.”

తులసివనంలాంటి అడవుల జిల్లాలో గంజాయి మత్తెక్కిస్తోంది. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలామంది ఈ అలవాటుకు బానిసవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉంది. ఇలా బానసలు అవుతారు.. కొందరు యువకులు ఈ మత్తుకు అలవాటుపడతారు. వారు అక్కడితో ఆగకుండా పక్కవారిని చెడగొట్టేందుకు ఆ మత్తులో ఉండే ఆనందాన్ని రెట్టింపు చేసి చెబుతారు. అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే నెపంతో గంజాయి అలవాటుకు బానిసవుతున్నారు యువకులు. మద్యంతో వచ్చే మత్తుకంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందని, అదో కొత్త కిక్కు అంటూ కొత్తవారిని అటువైపు తీసుకెళ్తుంటారు బానిసలు. గంజాయి సేవిస్తే అదనపు మత్తు ఉంటుందనే భావన యువకుల్లో ఉంది. అదే భావనతో వారు బానిసలయ్యే ప్రమాదం ఉంది.

తల్లిదండ్రులు ఇవి గుర్తించాలి.. గంజాయికి అలవాటుపడిన యువకులు మిగతావారితో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు, ప్రేమ ఇతర విషయాల్లో కలత చెందినప్పుడు యువకులు దీనివైపు మొగ్గుచూపుతారు. అలాంటివారి ప్రవర్తన ఇంట్లోనూ వేరే విధంగా ఉంటుంది. ఒంటరిగా ఉండడం, తాను ఉండే గదికి లోపలి నుంచి గొలుసుపెట్టుకుని గంటల తరబడి ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, నేరుగా కళ్లలోకి చూడకుండా పక్కలకు చూస్తూ మాట్లాడడంలాంటివి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇవీ లక్షణాలు… గంజాయి తాగేవారి కళ్లు మిగతావారికి భిన్నంగా, కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. వీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడపడుతూ ఉంటారు. శుభ్రతపై మక్కువపోయి, మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు.. ఎందుకని అడిగితే అదే ఫ్యాషన్‌ అం‌టూ సాకులు చెబుతుంటారు. గతంతో పోలిస్తే పాకెట్‌ ‌మనీ ఎక్కువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తడి చేస్తుంటారు.

మాదకద్రవ్యాల మత్తులో యువత మునిగి తేలుతోంది. సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించేవారు ఎక్కువవుతున్నారు. సాఫ్ట్‌డ్రింక్‌తో ప్రారంభమైన మత్తు పానీయాలు గంజాయి, డ్రగ్స్ ‌వరకు ఎగబాకుతున్నాయి. మద్యం సేవించడం అలవాటు లేనివారిని చిన్నచూపు చూసే విధంగా సమాజంలో చెడు అలవాట్లు పెచ్చుమీరిపోతున్నాయి. దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్త వయసులోనే అనారోగ్యానికి గురౌతున్నారు. శరీర అంతర్భాగం తూట్లు తూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమైనది
పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మొదట కళాశాల, తర్వాత ఇంట్లో యువత ఎక్కువ గడిపేది. ప్రస్తుతం ఒకే ఇంట్లో భార్యా, భర్తలు ఇద్దరూ జాబ్‌లు చేస్తున్నారు. దీంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. అందువల్ల పిల్లలపై పర్యవేక్షణ కరువవుతోంది. ఒక్కోసారి ఒంటరిగా ఫీలై స్నేహాలు చేస్తున్నారు. అవి మంచి స్నేహాలైతే పర్వాలేదు. కానీ, చెడు సావాసాలైతే ప్రమాదమే. అందుకే తల్లిదండ్రులే పిల్లలను కాపాడుకోవాలి.

గంజాయి సేవించడం వల్ల కలిగే నష్టాలు:
గంజాయి పీల్చాక వాహనం నడిపితే స్వర్గ ద్వారాలకు చేరువ అవడం ఖాయం: గంజాయి పీల్చి డ్రైవింగ్‌ ‌చేసే వారు, విచక్షణ, సమయ స్ఫూర్తి లోపించి, ప్రమాదాలకు లోనవడమే కాకుండా , ఇతర వాహన చోదకుల, పాద చారుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తారు.

గంజాయి ఊపిరి తిత్తుల క్యాన్సర్‌ ‌కు ( లంగ్‌ ‌క్యాన్సర్‌ ) ‌కు హేతువు: బాగా పట్టు బిగించి గంజాయి దమ్ము లాగే వారి ఊపిరితిత్తులను , వారి జీవితాలనూ కూడా ఆ గంజాయి లాక్కెళుతుంది.

గంజాయి స్కిజోఫ్రీనియా కి కారకం: గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమేణా అధ్వాన్నం అవుతుంది. వారు తరచూ , మనుషులు లేని చోట మనుషులను చూడడం, లేదా మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను, ఎవరూ లేని చోట వినడం అంటే శూన్యం లో శబ్దాలను వినడం జరుగుతుంది. అంటే వారు హాలూసినేషన్స్ అనే విచిత్ర అనుభూతి చెందుతూ ఉంటారు. ఈ హాలూసినేషన్స్ ‌తరచూ వస్తూ ఉంటే , వారు క్రమేణా విపరీతమైన భయం చెందుతూ , ఇతర వ్యక్తులు కొందరు కానీ , లేక అందరూ కానీ , వారి కి ఎప్పుడూ హాని తలపెట్టే ఉద్దేశం లో ఉన్నారని భావిస్తూ ఉంటారు.

గంజాయితో వ్యంధత్వం (infertility): చాలా కాలం గంజాయి దమ్ము లాగే పురుషులలో శుక్ర కణాలు తగ్గి అంటే స్పెర్మ్ ‌కౌంట్‌ ‌తగ్గి పోయి, వారు తండ్రులు కాలేక పోవడం , అట్లాగే స్త్రీలలో అండాలు తగ్గి, వారు గర్భవతులు కాలేక పోవడం కూడా జరుగుతుంది.

గంజాయి పీలిస్తే, వికలాంగ శిశువుల జననం: బాగా గంజాయి పీల్చే స్త్రీలు గర్భవతులవుతే , వారికి కలగ బోయే శిశువులు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. మాదక ద్రవ్యాల కంటే కిక్‌ ‌నిచ్చే సాధనాలున్నాయి… మాదక ద్రవ్యాలు కిక్‌ ‌నిస్తున్నాయి కాబట్టి వాటిని సేవిస్తున్నారు. ఆ కిక్‌ ‌కోసమే ఆరోగ్యం పాడుచేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారని కొందరు వాదిస్తారు. కానీ వాస్తవానికి వాటి కంటే కిక్‌ ‌నిచ్చే విషయాలు ప్రపంచంలోఎన్నో ఉన్నాయి. ఒక గంటసేపు కదలకుండా ఒకచోట కూర్చుని , ఒక విషయంపై శ్రద్ధ పెట్టి తదేకంగా ధ్యానం చేస్తే వచ్చే కిక్‌ ఎన్ని మాదక ద్రవ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి పని చేసినప్పుడు, సాటి మనిషికి ఉపకారం చేసినప్పుడు, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టినప్పుడు వచ్చే కిక్‌ ఎం‌తో బాగుంటుంది. చదివుతో ఒక మంచి పొజిషన్‌ ‌లో ఉన్నప్పుడూ ఆ కిక్‌ ‌వేరుగా ఉంటుంది. ఇటువంటి విషయాలను ప్రతీ విద్యార్ధికి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్నతనం నుంచి చెప్పగలగాలి.

dr atla srinivas reddy
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

 

Leave a Reply