భౌగోళిక కాలమానంలో మనిషి జీవితం సూక్ష్మాతిసూక్ష్మం. వందేండ్ల జీవితం బహు స్వల్పం. జీవితంలో బాల్యం మరియు వృద్ధాప్యం సగభాగం కదా. బాల్యం జ్ఞానసమపార్జనకు మరియు వృద్ధాప్యంలో బలహీనపడిన దేహం విశ్రాంత జీవనాన్ని కోరుకుంటుంది. విద్యాబుద్ధులు జీవన సౌంధర్య సాధనాలు. జీవించడానికి ఓ వృత్తి కావాలి. వృత్తితో ఆర్థిక వెసులుబాటు జరిగాలి. ఉద్యోగం మరియు ఆకర్షనీయ వేతనం కోరుకోని వారెవరూ ఉండరు. ఆకర్షనీయ జీతం అన్ని భౌతిక సౌకర్యాలను అందిస్తుంది. జీతం మాత్రమే జీవితమవుతుందా ? సకల సౌకర్యాలు సంతోషాన్నిస్తాయా ? జీవితంలో ఓ చిన్న భాగమైన జీతంతో ఆనందమయ క్షణాలు వస్తాయా ? ఆనందం అంగట్లో దోరికే సరుకు కాదు కదా. సంతోషానికి సరసమైన ధర ఉంటుందా ? జీవితం ఆనందమయం కావడానికి అవసరమైన రహస్యాలు మనందరి మనస్సుల్లోనే దాగి ఉన్నాయని మరిచి పోయి, ఖరీదైన వస్తువుల్లో వెతుకుతున్నాం. ఖరీదైన పరుపు కొనవచ్చు, నిద్రను కొనలేం. ఆట వస్తువులు కొనవచ్చు, ఆనందాన్ని కొనలేం. పుస్తకం కొనవచ్చు, విజ్ఞానాన్ని కొనలేం. ఔషధం కొనవచ్చు, ఆరోగ్యాన్ని కొనలేమని అందరికీ తెలుసు. జీవితంలో ప్రతి క్షణాన్ని అమిత సంతోషంగా గడపడానికి, సంతోషాన్ని పరులకు పంచడానికి ఉపయుక్తమయ్యే 15 అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
1. మనకు అందుబాటులో ఉన్న 10 వస్తువులను గుర్తించండి. మన వద్ద లేని వాటి కోసం ఆలోచిస్తే ఆనందం హరించుకుపోతుంది. చేతులో ఉన్న వాటిని ప్రసాధించిన భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుదాం.
2. ప్రతి రోజు విధిగా కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయిద్దాం. మనలోని విచారం మరియు ఒత్తిడిని వ్యాయామం తగ్గిస్తుంది.
3. సమయం లేదని, బరువు పెరుగుతామని ఉదయం ఉపాహారానికి (బ్రేక్ ఫాస్ట్) దూరం కావద్దు. ఉపాహార శక్తితో చురుకుదనం పెరిగి కార్యాలు ఫలప్రదం అవుతూ సంతోషం కలుగుతుంది
4. ధృఢ సంకల్పంతో ఉన్న దానికి సదాలోచన జోడించి సాఫల్యతకు ప్రయత్నించాలి. దురాశతో చివరకు విచారం మరియు నిరాశ పెరుగుతూ, ఆత్మవిశ్వాసం తరుగుతుంది.
5. మనకు ఇష్టం ఉన్న రంగాల్లో ఖర్చు పెట్టడం ద్వారా 75 శాతం మంది ఆనందాన్ని పొందుతున్నారు. కొన్న వస్తువుల నుండి తాత్కాలిక సుఖాన్ని మరియు సంతోషాన్ని మాత్రమే పొందవచ్చు.
6. సవాళ్ళను వెంటనే ధైర్యంగా ఎదుర్కొందాం. సమస్యను వాయిదా వేసినపుడు ఆందోళన పొడిగించబడి ఉద్రిక్తతకు దారి తీస్తుంది. అకారణ వాయిదా అనర్థదాయకం.
7. మన గృహంలోని ప్రతి చోట గత ఆనంద క్షణాలను గుర్తు చేసే ఫోటోలు, మధురానుభూతులతో కంప్యూటర్, డెస్క్, రూమ్లను అలంకరిద్దాం, ఆనంద క్షణాలను మననం చేసుకుందాం.
8. ఇరుగు పొరుగుతో సంతోషంగా ఉందాం. ఆనందంగా ఉండడం మరియు ఆనందాలను పంచడమే అసలైన జీవితసారమని నమ్ముదాం. నవ్వుతూ నమస్కరిస్తే, ఎదుటి వారి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూస్తాయని మరువరాదు.
9. నిలబడినా, కూర్చున్నా, నడిచినా తల ఎత్తుకొని, వెన్నెముక నిటారుగా ఉంచి ఆత్మవిశ్వాసం ఉట్టి పడేలా ప్రవర్తిద్దాం. డీలాపడినట్లుగా ఉన్నపుడు నిరాశ దరి చేరుతుంది.
10. సరైన కొలతలు గల పాదరక్షలు మరియు బూట్లు వాడుదాం. వాటి సైజ్ మారితే ఏకాగ్రత లోపించి మానసిక స్థితికి భంగం వాటిల్లుతుంది.
11. మనకు ఇష్టమైన మృధు సంగీతాన్ని ఆశ్వాదిద్దాం. సంగీతంతో శరీర కణాలు నిద్ర లేచి చురుకుదనం అందుతుంది.
12. మనం తినే ఆహార పదార్థాలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఉదయం ఉపాహారం, మద్యాహ్న భోజనం, సాయంకాల అల్పాహారం మరియు రాత్రి భోజనం సమయానుసారం పరిమితంగా తీసుకుందాం. ప్రతి 3 – 4 గంటల వ్యవధిలో స్వల్ప ఆహారాన్ని ఆశ్వాదిద్దాం. తెలుపు పిండి మరియు చెక్కరలను తగ్గిద్దాం.
13. మన శరీరాన్ని శుభ్రంగా, అందంగా ఉండేలా చూసుకుందాం. అందంగా ఉన్నామన్న భావన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
14. అమితోత్సాహంగా దేవున్ని నమ్మదాం. ఆయన ఉన్నాడన్న భావన ఎంతో ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆయన మన వెంట ఉన్నపుడూ, అసాధ్యాలను కూడా సుసాధ్యాలుు.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037