“ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి, వారి ఆగ డాలను అఫ్ఘాన్ ప్రజలు ఎదుర్కోలేక నానా అవస్థలు పడుతున్నారు,తాలిబన్ ల అరాచకాలను ఇంకేన్నాళ్లు భరించాలి అని అఫ్ఘాన్ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఈ దెబ్బతో అఫ్ఘానిస్థాన్ దేశంలో భవిష్యత్తులో కూడా అభివృద్ధి కోలుకోకుండా చేస్తారు. తాలిబన్ లు అధికా రంలో ఉన్నంత కాలం ఆ దేశంలో పౌర హక్కులు నశిస్తాయి, బాలలకు, ప్రజలకు ఏ మాత్రం రక్షణ ఉండదు, స్వేచ్చ, సమానత్వం అనేది ఉండదు,స్వేచ్చగా ఎవరి పని వాళ్లు చేసుకుందాం అనుకుంటే కూడా ఆ అవకాశం ఉండదు,ప్రజలంతా వారికి బానిసలుగా ఉండాల్సి వస్తుంది. అలాగని తాలిబన్లపై తిరగబడితే వారిని క్రూరంగా హింసిస్తారు, అవసరం అయితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోంటున్న అఫ్ఘాన్ల పరిస్థితి క్షణం క్షణం భయం భయంగా తయారయింది, ఇక మహిళల పరిస్థితి అగమ్య గోచారంగా తయారయింది.”
అఫ్ఘానిస్థాన్ దేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విపత్కర, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోంటున్న దేశం..అఫ్ఘానిస్థాన్ దేశంలో పరిపాలన ప్రశాంతంగా కొనసాగుతున్న సమ యంలో అకస్మాతుగా అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి రావడంతో అఫ్ఘానిస్థాన్ దేశంలో ఆ దేశ పౌరులు, ఆ దేశ ప్రజలు,తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా స్వేచ్చగా బ్రతకడమే ఇబ్బందిగా మారిందనీ అంతేకాక తాలిబన్లు అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించు కోవడంతో ఆ దేశంలోఅస్థిరత, అశాంతి నెలకొందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాలిబన్లు పాలన క్రూరమైన పాలన,అరాచక పాలన, వారి చేతిలో అధికారం ఉంటే ప్రజలు నిరంతరం భయ భ్రాంతులకు గురి కావడమే కాకుండా ఆ ప్రాంతం అంతా హింసాత్మకంగా మారడం గతంలో చూసాం. . ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశ పరిస్థితి ఏ రంగంలో చూసుకున్న ఆందోళనకరంగా మారింది,ఆ దేశంలో విద్యా ప్రమాణాలు దెబ్బ తిన్నాయి, ఆ దేశ ప్రగతి దెబ్బ తిన్నది, ఈ విషయాలను ఏ మాత్రం ఆలోచించకుండా వారి క్రూరమైన సామ్రాజ్యాన్ని మరింత ఆక్రమించుకోవడం గురించే ఆలోచిస్తారు,
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి, వారి ఆగ డాలను అఫ్ఘాన్ ప్రజలు ఎదుర్కోలేక నానా అవస్థలు పడుతున్నారు,తాలిబన్ ల అరాచకాలను ఇంకేన్నాళ్లు భరించాలి అని అఫ్ఘాన్ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఈ దెబ్బతో అఫ్ఘానిస్థాన్ దేశంలో భవిష్యత్తులో కూడా అభివృద్ధి కోలుకోకుండా చేస్తారు. తాలిబన్ లు అధికా రంలో ఉన్నంత కాలం ఆ దేశంలో పౌర హక్కులు నశిస్తాయి, బాలలకు, ప్రజలకు ఏ మాత్రం రక్షణ ఉండదు, స్వేచ్చ, సమానత్వం అనేది ఉండదు,స్వేచ్చగా ఎవరి పని వాళ్లు చేసుకుందాం అనుకుంటే కూడా ఆ అవకాశం ఉండదు,ప్రజలంతా వారికి బానిసలుగా ఉండాల్సి వస్తుంది. అలాగని తాలిబన్లపై తిరగబడితే వారిని క్రూరంగా హింసిస్తారు, అవసరం అయితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోంటున్న అఫ్ఘాన్ల పరిస్థితి క్షణం క్షణం భయం భయంగా తయారయింది, ఇక మహిళల పరిస్థితి అగమ్య గోచారంగా తయారయింది.
ఈ పరిణామాల న్నీంటినీ నుంచి అఫ్ఘానిస్థాన్ త్వరగా తేరుకో వాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏకం అయి అఫ్ఘాని స్థాన్ కు సహయం చేస్తూనే ఈ తాలిబన్ రాజ్యాని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి.. అప్పుడే అఫ్ఘానిస్థాన్ దేశంలో ప్రపంచంలో ఇతర దేశాల మాదిరిగా స్వేచ్చా,సమానత్వాని పొందుతుంది, తాలిబన్ లు ప్రధానంగా మధ్యరాతి యుగం నాటి శిక్షలైనటువంటి ఎవ్వరైన తప్పు చేస్తే వారి చేతులు నరకడం,అందరి ముందే తప్పు చేసిన వారి తలలు నరకడం వంటి హీనాతి హీనమైన చర్యలు వాళ్లు తీసుకుంటారు,ఈ తాలిబన్ ల పాలనను వీలైనంత త్వరగా నాశనం చేయ్యకపోతే ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ కాక భవిష్యత్ లో గల్ఫ్ దేశాలు,మరియు మిగతా ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశం ఉంది,అందుకే ఈ తాలిబన్ సామ్రాజ్యాని అంతం చేయ్యడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలు తక్షణమే నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ..
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా సైన్యం ఉన్నంత వరకు తాలిబన్ లు అధికారం హస్త గతం చేసుకోవాలని ఏ రోజు కూడా సాహసించలేదు కానీ ఎప్పుడైతే అమెరికా సైన్యం అఫ్ఘానిస్థాన్ దేశం నుండి వైదొలగిందో ఆ మరుక్షణం నుండి అఫ్ఘానిస్థాన్ ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా తాలిబన్ లు అడుగులు వేశారు. చివరికి వారు అనుకున్న విధంగానే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ ల చేతిలోకి వెళ్ళిపోయింది,ఆ తర్వాత అఫ్గానిస్థాన్ గా ఉన్నటువంటి ఆ దేశ పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే.
ఐక్య రాజ్య సమితి ఏర్పడింది ప్రపంచ శాంతి స్థాపన కోసం అంతేకాక ఐక్యరాజ్యసమితి లోని ధర్మ కర్తృత్వ మండలి అనేది ప్రపంచంలో ఏ దేశాలైతే స్వాతంత్రం పొందలేదో ఆ దేశాలకు స్వాతంత్రాని ప్రసాదించడమే కాకుండా ఆయా దేశాల్లో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది,కానీ ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిపై ఐక్య రాజ్య సమితి స్పందించిన ఏ మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడం ఒక్కింట ఆశ్చర్యం కలిగిస్తుంది,ఒకవేళ ఐక్య రాజ్య సమితి ఈ అఫ్గానిస్థాన్ సంక్షోభంపై పరిష్కారం దిశగా ప్రయత్నం చేయకపోతే ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే ఇది ఘోర వైఫల్యం ఐక్యరాజ్యసమితి మూట గట్టుకోక తప్పదు.
ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ప్రపంచ దేశాలకు ఈ ఉగ్రవాదం అనేది ఒక కొరక రాని కొయ్యగా తయారయింది,తాజాగా పోర్చుగీస్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరల్స్ మాట్లాడుతూ ఈ తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని పిలుపు ఇచ్చారంటే తీవ్రవాదం ఎంత ప్రమాదకరమైనదో,ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు, అయితే ఆఫ్ఘనిస్తాన్ కాక ప్రపంచంలోని అన్ని దేశాలు రాజకీయంగా,సాంఘికంగా,ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే మొదటగా చేయాల్సిన పని ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయడమే.
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దాదాపు మూడు లక్షల సైన్యం ఉంటే ఈ తాలిబన్ లను ఎదుర్కోలేక కేవలం ఇరవై రెండు రోజులలోనే తాలిబన్లు అధికా రంను హస్తగతం చేసుకోవడం చాలా దుర దృష్టకరం, ఆఫ్ఘనిస్తాన్ దేశం పూర్తిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుండి తాలిబన్ ల చేతికి రావడంతో ఆ దేశ ప్రజలు ఆశించిన ప్రగతికి దూరం అవ్వడమే కాకుండా ,ఆ దేశ భద్రత ప్రమాదంలో పడింది. సాంఘికంగా, రాజకీ యంగా, ఆర్థికంగా, మరియు దౌత్య రాయబార విషయంలో ఆఫ్ఘనిస్తాన్దేశ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు చాలా భయంకరంగా మారింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశాని తాలిబన్లు వశపర్చుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి కాదు గతంలో 1996-2001 మధ్య కాలంలో అఫ్ఘానిస్థాన్ దేశాని తాలిబన్ లు హస్తగతం చేసుకున్నారు, తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత అఫ్ఘానిస్థాన్ లో మళ్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏర్పడిందో అదేవిధంగా మళ్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రావాలని అఫ్ఘానిస్థాన్ ప్రజలే కాక ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.
– కేతూరి శ్రీరామ్, ఉస్మానియా యూనివర్సిటీ,మోబైల్ నంబర్ :9640300169.