Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ఎట్లా అమలవుతోంది?

  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
  • సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

రాష్ట్రంలో కొరోనా పరిస్థితి వైరస్‌ ‌నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ విధంగా అమలవుతున్నాయనే విషయంపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఏ ‌విధంగా అమలవుతోంది ? ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఏవైనా ఇబ్బంది పడుతున్నారా ? అనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, అత్యవరస సమయాలలో ప్రజా రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని పేర్కొన్నారు.

కొరోనా నివారణకు మరిన్ని చర్యలు చేపట్టే దిశగా సైతం ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చర్చించారు. అలాగే, ప్రజలకు శుక్రవారం నుం•చి నిత్యావసర వస్తువులు, ఉచిత రేషన్‌ ‌బియ్మం అందజేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు గుంపులు, గుంపులుగా బయటకు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు పెరిగిన పక్షంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Leave a Reply