Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ఎం‌త దూరం ?

“ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. కొరోనా రోగులకు సేవలు అందించాల్సిందే. కానీ అందరినీ క్వారంటైన్‌లలో ఉంచేసి రోజుల తరబడి లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించడం అతిగానే కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. 3.0 లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో కొన్ని సడలింపులు ప్రకటించారు. వాటి ఫలితాలను చూసి మిగిలిన రంగాలలో కూడా వెసులుబాటు కల్పించాలి. భారత్‌ ‌వంటి అతి పెద్ద దేశంలో రోజుల కొద్దీ పనీ పాటా లేకుండా జనం ఇళ్ళలో కూర్చోవడం వారికీ, దేశానికీ మంచిది కాదు. లాక్‌ ‌డౌన్‌ ఎం‌త దూరం…ఎంతెంత దూరం.”

పరిస్థితి సాధారణం గానే ఉంది. కానీ  దేశంలో అన్నీ బంద్‌ అయ్యాయి.  ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం దేశాన్ని అచేతన పర్చే రిస్క్ ‌తీసుకున్నారు. మన దేశంలో కొరోనా  కేసులు, మరణాలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. అయినా కొరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రధానమంత్రి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ఎంత కాలం ఈ కఠిన నిర్ణయాలను ప్రజలు భరించ గలరు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ఆశించిన ఫలితాలు లభించాయనుకుంటే అది ఆత్మవంచనే. పనులు మానేసుకుని ఇళ్ళల్లో కూర్చున్నంత మాత్రాన కొరోనా ఎంత కాలమైనా దారిలోకి వస్తుందనుకుంటే భ్రమే. కొరోనా వ్యాప్తిని నిర్ణీత సమయంలో అరికట్టలేం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దశాబ్దాల క్రితం అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌నటించిన నట్వర్‌ ‌లాల్‌ ‌సినిమాలో మరుపురాని సంభాషణలూ,   పాటలు గుర్తుకు వస్తున్నాయి. అలాగే, దేవానంద్‌, ‌ప్రేమ పూజారిలో పాటలు గుర్తుకు వస్తున్నాయి.

మన ఆర్థిక వ్యవస్థ సంస్కరణల అనంతరం పుంజుకుంది. తయారీ, పారిశ్రామిక రంగాలు క్రమంగా  మెరుగు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కొరోనా మీద పడి మన వ్యవస్థను దెబ్బతీస్తున్న మాట నిజమే. రోగికి రోజూ టెంపరేచర్‌ ‌చూసి చికిత్స చేస్తున్నా రోగి చనిపోవడం ఎలాంటిదో   ప్రస్తుత పరిస్థితి కూడా అలాంటిదే. జ్వరాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కొరోనాను తనిఖీని అర్థం చేసుకోగలం కానీ అరికట్టేందుకు మన దేశంలో క్వారంటైన్లు, ఐసోలేషన్లు వంటివి బాగానే పాటిస్తున్నారు. కానీ, వైరస్‌ ‌వ్యాప్తి  తగ్గడం లేదు. రెండు వారాల లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ఆశించిన ఫలితాలు ఒనగూరలేదు. కొంతమంది అధికారులు మినీ రాబర్ట్ ‌ముగాబేల్లా తయారవుతున్నారు. జర్నలిస్టులను జిల్లాల పరిథిలు దాటి రావద్దుంటున్నారు.  హర్యానాలో ఒక సీనియర్‌ ‌పోలీసు అధికారి మాట్లాడుతూ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామన్నారు. విలేఖరులను సరిహద్దులను దాటొద్దనడం ఎక్కడా వినలేదు, చూడలేదు. కొరోనాకు హద్దులు నిర్దారించడం కోసం ఇటీవల మంచిగా వేసిన రోడ్లను బేరికేడ్ల కోసం తవ్వేస్తున్నారు.  వలస కార్మికు లను కదలనివ్వకుండా చేయడం వల్ల వారి ఉపాధి పోగొట్టారు. లాక్‌ ‌డౌన్‌ 3.0 ‌ప్రకటించిన తర్వాత వలస కార్మికులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
మన ఆర్థిక వ్యవస్థ అమెరికా, తదితర సంపన్న దేశాలవంటిది కాదు.

పనులు నిరంతరాయంగా మూసివేసుకుని ఇళ్ళల్లో కూర్చోవడం వల్ల కార్మికులకూ ఇబ్బందే, ఆర్థిక వ్యవస్థకూ ఇబ్బందే. వైద్య సేవలను అందిస్తున్న వారిని గౌరవించడం కోసం గగనతలం నుంచి దవాఖానాలపై  పూలవర్షం కురిపించడం వంటి కొత్త ఆలోచనలు అమలు జేస్తున్నారు. కానీ, లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల  ఇబ్బందులకు గురవుతున్న పేద వర్గాలను ఆదుకోవడానికి సరైన  ఆలోచనలు చేయడం లేదు. అనాలోచితంగా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడం, దానిని పొడిగిస్తూ పోవడంతో ప్రజల ఇబ్బందులు మరింత ఉధృతం అవుతున్నాయి. వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, సామాన్యులకు చింత లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎ ప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. కొరోనా రోగులకు సేవలు అందించాల్సిందే. కానీ అందరినీ క్వారంటైన్‌లలో ఉంచేసి రోజుల తరబడి లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించడం అతిగానే కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. 3.0 లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో కొన్ని సడలింపులు ప్రకటించారు. వాటి ఫలితాలను చూసి మిగిలిన రంగాలలో కూడా వెసులుబాటు కల్పించాలి. భారత్‌ ‌వంటి అతి పెద్ద దేశంలో రోజుల కొద్దీ పనీ పాటా లేకుండా జనం ఇళ్ళలో కూర్చోవడం వారికీ, దేశానికీ మంచిది కాదు. లాక్‌ ‌డౌన్‌ ఎం‌త దూరం…ఎంతెంత దూరం.
– శేఖర్‌ ‌గుప్త
‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply