Take a fresh look at your lifestyle.

కొరోనా ఎఫెక్ట్ ‌జాబ్‌ ‌లెస్‌ ‌లైఫ్‌ ఎలా… పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి

ఇండియాలో కరోనావైరస్‌ ‌వ్యాప్తి దావానంలా వ్యాపిస్తూనే ఉంది. మరో రకంగా కూడా ఈ వైరస్‌ ‌ప్రజలకు మానసిక ఆందోళనలు, భయాలను పెంచేసి మానసిక ఆరోగ్య పరిస్తితి విషమించే స్తాయికి మారింది. కరోనావైరస్‌ ‌వ్యాప్తిని కట్టడి చేసేందు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌ ‌డౌన్‌ అమలు చేస్తుంది. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నీ రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక పరిస్తితి అతలాకుతులంగా మారింది. భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపిస్తోంది. కరోనావైరస్‌ ‌సంక్షోభం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అగ్ర రాజ్యమైన అమెరికాలో నిరుద్యోగం అత్యధిక స్థాయికి చేరుకుందని తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఏప్రిల్‌లో ఏకంగా 2.05 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారన్న వార్తలు అమెరికాకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వారిలో మానసికంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి అని అనడంలో సందేహాం లేదు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ ‌విధించాయి. లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా ఎన్నో కంపెనీలు, వ్యాపారాలు మూతపడ్డాయి. కొన్ని సంస్థలు వేతనం లేని సెలవులు ఇచ్చి ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తే మరికొన్ని కంపెనీలు వేతనాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నాయి.

ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఆదాయం కోల్పోయిన చాలా మంది ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి న పరిస్తితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల వల్ల కొందరు మానసికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాలో ఇప్పుడు ఆందోళనకరమైన వేగంతో నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోన ఫలితంగా విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగార్తులు మొగ్గు చూపకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరీ వీరందరికి మన దేశంలో ఉద్యోగాలు కలిపించగలుగుతామా.. సి.ఎం.ఐ.ఇ రిపోర్టు ( Centre for Monitoring Indian Economy ): కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని తగ్గించడానికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ‌వల్ల గతనెలలో దాదాపు 2.7 కోట్ల మంది యువత (20 నుంచి 30 ఏండ్లలోపువారు) ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 10వ తేదీతో ముగిసిన వారంలో నిరుద్యోగ రేటు 27.1 శాతం నుంచి 24 శాతానికి తగ్గినట్టు సీఎంఐఈ తన వీక్లీ రిపోర్ట్‌లో పేర్కొన్నది. గతనెలలో ఉద్యోగాలు కోల్పోయినవారిలో 25 నుంచి 29 ఏండ్ల వయసువారు 1.4 కోట్ల మంది, 30 ఏండ్లు పైబడిన యువతీ, యువకులు 3.3 కోట్ల మంది ఉన్నట్టు సీఎంఐఈ వివరించింది. భారతీయులతో పోల్చితే, అమెరికన్లు కొంతకాలం నిరుద్యోగులుగా ఉండగలుగుతారు, ఎందుకంటే నిరుద్యోగులకు అమెరికాలో నిరుద్యోగ భృతి ని అందిస్తుంది. లాక్డౌన్‌ ‌కారణంగా కోల్పోయిన ఉద్యోగ నష్టాల వల్ల ఎన్ని మరణాలు సంభవించవచ్చో ఊహించడానికే భయంకరంగా ఉంది. ఉద్యోగం కోల్పోవడం వల్ల చాలామంది మానసికంగా తీవ్రంగా దెబ్బతింటారు. పైగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఈ ఇబ్బందులు ఎన్నాళ్లు కొనసాగుతాయోనన్న ఆందోళన, ఉద్యోగం లేకపోతే నా కుటుంబానికి దిక్కు ఎవరూ అని తీవ్ర మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంటుంది.

మానసిక ఆందోళనల పట్ల అప్రమత్తత అవసరం:
భావోద్వేగాలను బ్యాలాన్స్ ‌చేసుకోవాలి: భావోద్వేగాలను నియంత్రించుకోవాలని అనుకోవడం సరికాదు. ఆనందం, బాధ, కోపం, భయం ఇలా చాలా రకాలైన భావోద్వేగాలు మనకు అందించే అనుభూతులు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల నష్టం కలిగితే ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు మన నియంత్రణలో లేవు. పరిస్తితులకు తగ్గట్లుగా మన భావోద్వేగాలు దుఃఖమైనా, సంతోషమైనా సరే.. మనలోని భావాలను మనం అనుభవించాలి, ఆత్మీయులతో పంచుకోవాలి. భావోద్వేగాల బ్యాలన్సింగ్‌ ‌పై దృష్టిని కేంద్రీకరించాలి.

పరిస్తితులను అనుకూలంగా మార్చుకోవాలి:
సాధారణంగా, మనకు ఏదైనా నష్టం జరిగితే, ఆ పరిస్థితి రావడానికి కారణలేంటో గుర్తించి, వాటిని అధిగమించడంపై దృష్టిపెట్టాలి. తక్షణం పరిష్కరించుకోగల సమస్యలను గుర్తించి (కొంతకాలం పాటు ఇంటి ఖర్చులను తగ్గించుకోవడం లాంటివి), అప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. అలా చేసినప్పుడు కొంత కాలం పాటు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినా, పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి.

పాజిటివ్‌ ఆలోచనలు పెంచుకోవాలి:
ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోతున్నప్పటికీ, ఇది తాత్కాలికమేనని, కరోనావైరస్‌ ‌సంక్షోభం ముగిశాక పరిస్థితులు మళ్లీ యధాస్తితికి చేరుకుంటుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయనే, నా వ్యక్తిగత సమస్యల కారణంగా నేను ఉద్యోగం కోల్పోలేదు. ఈ సంక్షోభం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఉపాధి పోయిందని షాక్‌ ఉన్నప్పటికీ, పరిస్థితులు మళ్లీ మెరుగుపడ్డాక, ఉద్యోగం లభిస్తుందన్న సానుకూల ఆలోచనతో ఉండాలి. సానుకూల ఆలోచనలను మనసులో పెంపొందించుకుని మనోదైర్యంతో ముందుకు సాగాలి.

ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది:
ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో దైర్ఘ్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల, మానసిక ఆందోళనలను తగ్గించుకోవాలి. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి. సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మంచి మార్గ దర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మెంటారుగా స్వీకరించడం , అంచెలంచెలుగా ఎదగాడానికి కృషి చేయాలి.

మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి:
ప్రపంచంలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. మనలో ఉన్న నైపుణ్యాలను మనకు మనముగా ఎల్లప్పుడూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు రానీయకూడదు. మనలో ఉన్న సామార్ధ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వసాన్ని దృఢప రచుకోవాలి. పరిస్తి తులు మెరుగు పడ్డాక ఇంత కంటే మంచి ఉద్యోగం సాధించ గలుగుతాను అనే నమ్మకం, పట్టుదలను రెట్టింపు చేసుకోవాలి.

అనవసర భయాలు వీడాలి:
ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు. ఇంత మందికి మరలా ఉద్యోగాలు దొరుకు తాయా, అందులో నాకు మళ్ళా ఉద్యోగం దొరుకు తుందా అనే అనవసర భయాలు దరిచేర కుండా జాగ్రత్త వహించాలి. సాను కూల ఆలోచనలతోటే మనసు ఉల్లాసంగా ఉంటుంది.

atla srinivas reddy
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
సైకాలజిస్టు, 9703935321

Leave a Reply