Take a fresh look at your lifestyle.

మోగిన ఆలయాల గంటలు

ఇష్టదైవాలు ఇల వేల్పులు దర్శించుకునే వెసులు బాటు ప్రభుత్వం కల్పించటడంతో ఆలయాల్లోకి భక్తుల అనుమతి లభించింది. దీనితో సోమవారం ఇల్లలోని పలు ఆలయాల్లో భక్తులు దర్శనాలు  చేసుకున్నారు. కరోనా నిబంధనలు దృష్ట్యా  భక్తులు దండంతోనే సరిపెట్టుకున్నారు. ప్రధానంగా దక్షిణభారత అయోద్య బాసిల్లుతున్న భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి  ఆలయానికి భక్తుల చేరుకుని రామచంద్రున్ని మనసారా దర్శించుకుని పూజించారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం దర్శనానికి వెసులుబాటు కల్పించారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూలెస్‌ ‌ద్వారా ఆలయంలోకి గర్బగుడిలో మాస్కులు ధరించి ప్రవేశించి మూలమూర్తులకు దండాలు పెట్టుకున్నారు. కనీసం గుడి గంటలు సైతం మోగించే వెసులుబాటు లేకుండా పోయింది. శఠారి ప్రత్యేక అర్చనలు నిర్వహించకపోగా తీర్ధ ప్రసాదాలు అందించలేదు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో దర్మల్‌ ‌స్కీనింగ్‌ ‌నిర్వహించి టెంపరేచర్‌ ‌చెక్‌ ‌చేసారు. అదేవిధంగా శానీటైజర్‌తో చేతులు శుద్ది చేసుకుని గుడి మెట్లు ఎక్కేముందు పాదాలను శుభ్రపరుచుకునేందుకు నీటి సదుపాయాన్ని కల్పించారు. 10 ఏళ్ళలోపు పిల్లలు 65 ఏళ్ళ పైబడిన వృద్దులు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించారు.

ఆలయ ప్రాంగణంలో ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్‌ ‌ద్రావణాన్ని పిచికారి చేసారు. సీతారామచంద్రస్వామి వారి గర్బగుడిలో మినాహాయింపు ఆలయం ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం లక్ష్మీతారాయారమ్మ వారి ఆలయాలుతలుపులు తెరవబడలేదు. భక్తుల సౌకర్యార్ధం తూర్పుమెట్లు వద్ద ఉన్న ప్రసదాల కౌంటర్ల వద్ద లడ్డూ, పులిహోర ప్రసాదాలను విక్రయించారు. ఆలయంలో తెరిచిన రోజు సోమవారం నాడు సుమారు 300 నుండి 400 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు టెంపుల్‌ ‌సిఆర్‌పి సాయిబాబా తెలిపారు. ఉదయం 6.30 నుండి మద్యాహ్న 11.30 వరకు సాయంత్రం 3నుండి 6.30 వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు ఉందని ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ వేలల్లోనే కొనసాగుతాయని అన్నారు.

Leave a Reply