Take a fresh look at your lifestyle.

పల్లెలో పడకేసిన వైద్యం

“మహాత్మ గాంధీ చెప్పిన భారత దేశానికి పట్టు కొమ్మలైన పల్లెలో, జనాభాకు తగిన వైద్యాన్ని అందించలేనక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 16వ జనాభా లెక్కల గణన కోవిడ్‌ ‌దృష్ట్యా వాయిదా పడింది., 2011 జనాభా లెక్కల ప్రకారం 1210.2 మిలియన్‌ ‌జనాభాలో గ్రామీణ ప్రాంత జనాభా 833.1 మిలియన్లు, పట్టణాల్లో 377.1 మిలియన్‌ ‌జనాభా ఉన్నారు.  సుమారు 70% మంది గ్రామాల్లో నివసిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్‌ ‌మొదటి వేవ్‌ ‌ముఖ్యంగా పట్టణ జనాభాను అతలాకుతలం చేయగా, రెండో వేవ్‌ ఎక్కువ మొత్తంలో పల్లెలపై పడగ విప్పింది. పల్లెల్లో వైద్య వ్యవస్థ పటిష్టంగా లేదన్న విషయం  కొరోనా గుర్తుచేసింది.”

మహాత్మ గాంధీ చెప్పిన భారత దేశానికి పట్టు కొమ్మలైన పల్లెలో, జనాభాకు తగిన వైద్యాన్ని అందించలేనక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 16వ జనాభా లెక్కల గణన కోవిడ్‌ ‌దృష్ట్యా వాయిదా పడింది., 2011 జనాభా లెక్కల ప్రకారం 1210.2 మిలియన్‌ ‌జనాభాలో గ్రామీణ ప్రాంత జనాభా 833.1 మిలియన్లు, పట్టణాల్లో 377.1 మిలియన్‌ ‌జనాభా ఉన్నారు.  సుమారు 70% మంది గ్రామాల్లో నివసిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్‌ ‌మొదటి వేవ్‌ ‌ముఖ్యంగా పట్టణ జనాభాను అతలాకుతలం చేయగా, రెండో వేవ్‌ ఎక్కువ మొత్తంలో పల్లెలపై పడగ విప్పింది. పల్లెల్లో వైద్య వ్యవస్థ పటిష్టంగా లేదన్న విషయం  కొరోనా గుర్తుచేసింది.

కేంద్రం బడ్జెట్లో వైద్యానికి జీడీపీలో 1.8% కేటాయించి, ప్రపంచంలో అత్యల్పంగా కేటాయించిన దేశంగా నిలిచింది.  తెలంగాణలో 2021-22 వార్షిక బడ్జెట్లో ఆరోగ్యరంగాని కి కేటాయించింది కేవలం 6,295/- కోట్లు. మొత్తం బడ్జెట్‌ 2.30 ‌లక్షల కోట్లలో 2.72% మాత్రమే. 2020-21 బడ్జెట్‌ ‌లో 6,186 కోట్లు కేటాయించి, కోవిడ్‌ ‌తొలిదశ వాతావరణం చూసిన తర్వాత కూడా,  మార్చ్ 18,  2021  ‌ముందుచూపు లేకుండా, పెంచింది కేవలం 109 కోట్లు మాత్రేమే.  కేవలం ప్రచార ఆర్భాటం కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైనట్లు చెప్పుకోవడం  సిగ్గుచేటు.! జిల్లాకో డయాగ్నిక్‌ ‌సెంటర్‌ ఏర్పాటు స్వాగతించాల్సిన అంశమే అయినా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యానికి దూరంగా ఉన్న గ్రామీణ జనాభాకు సరిపడా అంబులెన్స్ ‌లు లేవు. తెలంగాణలో ప్రతి 60 వేల మందికి ఒక 108 అంబులెన్స్ ఉం‌దని గణాంకాలు చెప్తున్నాయి.  కోవిడ్‌ ‌చికిత్సకు కు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వందల ఫిర్యాదులు అందితే, ప్రజల ఆగ్రహావేశాలు చల్లార్చడానికి, కేవలం పదుల సంఖ్యలో ఆసుపత్రులకు షోకాజు నోటీసులు ఇచ్చి, కొన్నింటికి లైసెన్సులు రద్దుచేసి చేతులు దులిపేసుకొని, అవే ఆసుపత్రులకు దొడ్డిదారిన మళ్ళీ అనుమతులు ఇచ్చింది. అధిక ఫీజులను వాపసు ఇప్పించాలని హైకోర్టు ఆదేశిస్తే, దండుకున్న వేలకోట్ల నుండి కేవలం 3 కోట్లు మాత్రమే ఇప్పించింది. ఆంద్రప్రదేశ్‌ 2020-21 ‌వార్షిక బడ్జెట్లో  వైద్యానికి11,419.48 కోట్లు కేటాయించింది.  2021-22 వార్షిక బడ్జెట్లో, కోవిడ్‌ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి గతం కంటే బడ్జెట్లో 21.11 శాతంఎక్కువగా.13,830.44 కోట్లు కేటాయించింది.

కేరళలో పినరన్‌ ‌విజయ్‌ ‌రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, 2021 జూన్‌ 4‌వ తేదీన బడ్జెట్‌ ‌లో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాముఖ్యతనిచిచి 20,000 కోట్ల కోవిడ్‌ ‌ప్రత్యేక ప్యాకేజి ప్రవేశ పెట్టారు. మునుపటి కేరళ ఆరోగ్య మంత్రి కే. కే. శైలజ  ఐక్య రాజ్య సమితి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతే కాదు, మేము కేంద్రంలో అధికారంలో ఉంటే వైద్యాన్ని జాతీయం చేశేవారమన్నారు. కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్లు ఫ్రీ వ్యాక్సినేషన్‌ ‌కోసం కేటాయించామని ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణలో లేదన్న సంగతి ‘‘టీకా ఉత్సవ్‌’’ ‌ప్రకటించగానే ప్రజలకు అర్ధమయ్యింది. కొరోనా థర్డ్ ‌వేవ్‌, ‌బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వంటి రాబోయే ప్రమాదాలను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ముందుగానే హెచ్చరించినా భారత ప్రభుత్వం, పేద ప్రజల ఆరోగ్యానిని గాలికి వదిలేసిందనడంలో సందేహమే లేదు.

కేరళ, ఆంద్రప్రదేశ్‌ ‌రాష్ట్రాలు అనుసరించే వైద్య విధానాలు, అధిక మొత్తంలో బడ్జెట్‌ ‌కేటాయింపులు మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి. షుం పీటర్‌, ‌రాజకీయార్థిక నిపుణుడు అన్నట్లు ‘‘రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పడిన సంస్థాగత ఏర్పాటు, ప్రజల లక్ష్యాలను తెలుసుకొని, ఆ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను సమావేశాలకు పంపి నిర్ణయాలు తీసుకోవడమే ప్రజాస్వామ్యం’’.  భారత దేశంలో ప్రజాప్రతినిధుల కొనుగోలు, రాబోయే  ఎలా గెలవాలనే దానిపై ఉన్న వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రజా ఆరోగ్యం, ప్రజల అవసరాలపై  చర్చలు చట్టసభల్లో జరగడం లేదనేది నిజం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ‌ప్రకారం ప్రాథమిక హక్కులలోని ‘జీవించే హక్కు’లో భాగమైన నాణ్యమైన వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
–  ముఖేష్‌ ‌సామల
9703973946

Leave a Reply