Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఆశాజనకంగా వర్షాలు

  • జూన్‌లో 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం
  • ఆదిలాబాద్‌లో అత్యధికంగా 318.7 మిల్లీమీటర్లు,
  • వనపర్తిలో అత్యల్పంగా 76.8 మిల్లీమీటర్లు
  • రూ.7360.41 కోట్ల రైతుబంధు నిధులు 60.84 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

మొత్తం 33 జిల్లాలలో ఆరుజిల్లాలు మంచిర్యాల, నిర్మల్‌, ‌భదాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, ‌రంగారెడ్డి , వికారాబాద్‌ ‌జిల్లాలలో సాధారణ వర్షపాతం కురియగా, మిగతా 27 జిల్లాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి వెల్లడించారు. గత ఏడాది ఈ సమయానికి 171.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 141.12 లక్షల ఎకరాలలో సాగు ప్రణాళిక అంచనా వేయగా ఇప్పటి వరకు 34.35 లక్షల ఎకరాలలో అంటే 25 శాతం పంటల సాగు ప్రధాన పంటలయిన పత్తి 26.05 లక్షల ఎకరాలు, కంది 3.18 లక్షల ఎకరాలు సాగు చేశారు. 96 వేల ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది. దాదాపు 50 వేల ఎకరాలలలో పెసర, లక్ష ఎకరాలలో మొక్కజొన్న సాగు నమోదయింది. ఇవి కాకుండా 87 వేల ఎకరాలలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగు నమోదయింది. 5.7 లక్షల ఎకరాలలో పండ్ల తోటలు, బహుళవార్షిక ఉద్యానపంటలు సాగవుతున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పత్తి, కంది సాగు క్షేత్రస్థాయిలో ఎక్కువగా నమోదవుతుంది.

రైతు సోదరులు దీనిని కొనసాగిస్తూ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పత్తి, పప్పుదినుసులు, నూనెగింజల పంటలనే ఎక్కువగా సాగు చేయాలని, వరి సాగును తగ్గించాలని ఆయన సూచించారు. ఈ వానాకాలానికి 25.5 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఎరువులకు గాను 8.38 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, 4.35 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల యూరియా అందుబాటులో ఉందని, జూన్‌, ‌జులై నెలలకు కేంద్రం కేటాయించిన ప్రకారం ఎరువులను దిగుమతి చేసుకోవాలని, తెలంగాణకు కేటాయించిన కోటా ప్రకారం వివిధరకాల ఎరువులు ఏ దేశం నుండి, ఏ పోర్టులకు వొస్తున్న విషయం ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని నిరంజన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

వెజల్స్ ‌వారీగా కేంద్రం ఎరువులు కేటాయింపులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.7360.41 కోట్ల రైతుబంధు నిధులు 60.84 లక్షల మంది రైతుల ఖాతాలలో జమచేయడం జరిగిందని, వ్యవసాయరంగానికి చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టాస్క్ ‌ఫోర్స్ ‌దాడులలో ఇప్పటి వరకు 325 క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేశారని, 518 మంది అరెస్టు అయ్యారని, 25.7 కోట్ల విలువగల 11,848 క్వింటాళ్ల విత్తనాలు సీజ్‌ ‌చేయడం జరిగిందని, 78 కోట్ల విలువగల 23,720 క్వింటాళ్ల విత్తనాల అమ్మకాలు నిలిపివేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

Leave a Reply