Take a fresh look at your lifestyle.

హాంకాంగ్‌లో నిరసనలు ఓ ఆదర్శం

2019 ‌సంవత్సరం హాంకాంగ్‌కు మరిచిపోలేని సంవత్సరం, నేరస్థులుగా అనుమానితులపై విచారణ కోసం చైనాకు పంపేందుకు ఉద్దేశించిన బిల్లును హాంకాంగ్‌ ‌ప్రత్యేక పాలనా ప్రాధికార సంస్థ చైనా వొత్తిడిపై ఆమోదించేందుకు సిద్ధపడింది. దీనిపై హాంకాంగ్‌లో అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోకి వొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. ఒకరోజూ, రెండు రోజులు కాదు, నిరవధికంగా నిరసన తెలపడంతో వాణిజ్య కార్యకలాపాలు, పౌరజీవనం స్తంభించింది. ప్రజా ఉద్యమాలను ఏ స్థాయిలో నిర్వహించాలో  రుజువు పర్చే విధంగా ఈ ఆందోళనలు జరిగాయి.

Chinese business tycoon, Hong Kong,ideal In Protests, it networks

నిరంతర నిరసన ప్రదర్శనల వల్ల ప్రయోజనం ఉంటుందని హాంకాంగ్‌ ‌నగరం రుజువు చేసింది. 2019 సంవత్సరం హాంకాంగ్‌కు మరిచిపోలేని సంవత్సరం, నేరస్థులుగా అనుమానితులపై విచారణ కోసం చైనాకు పంపేందుకు ఉద్దేశించిన బిల్లును హాంకాంగ్‌ ‌ప్రత్యేక పాలనా ప్రాధికార సంస్థ చైనా వొత్తిడిపై ఆమోదించేందుకు సిద్ధపడింది. దీనిపై హాంకాంగ్‌లో అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసన తెలిపారు. ఒకరోజూ, రెండు రోజులు కాదు, నిరవధికంగా నిరసన తెలపడంతో వాణిజ్య కార్యకలాపాలు, పౌరజీవనం స్తంభించింది. ప్రజా ఉద్యమాలను ఏ స్థాయిలో నిర్వహించాలో రుజువు పర్చే విధంగా ఈ ఆందోళనలు జరిగాయి. ఇందుకు సంబంధించిన బిల్లును స్థానిక పాలనా యంత్రాంగం ఉపసంహరించుకున్నప్పటికీ నిరసనలు ఆగలేదు. నిరసనల సమయంలో పోలీసులు అనుసరించిన దౌష్ట్ట్యంపైనా, హింస పైనా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని నిరసనకారులు కోరారు పోలీసులను అరెస్టు చేయాలని కూడా వారు డిమాండ్‌ ‌చేశారు. 1997 నుంచి హాంకాంగ్‌లో 50వేల నిరసన ప్రదర్శనలు జరిగాయని సామాజిక శాస్త్రవేత్త డేనియల్‌ ‌గారెట్‌ ‌తెలిపారు. అదే సంవత్సరంలో చైనా నుంచి హాంకాంగ్‌ ‌స్వయం పాలనలోకి వొచ్చింది. సెమీ అటానమస్‌ ‌ప్రతిపత్తి లభించింది. అయితే, చైనా హాంకాంగ్‌ను తమ దేశంలో కలుపుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. హాంకాంగ్‌లో పరిమిత ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేందుకు చైనా అంగీకరించింది.

2011లో రోజుకు 18 సార్లు నిరసన ప్రదర్శనలు జరిగినట్టు హాంకాంగ్‌ ‌సమాచార సేవా కేంద్రం అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అప్పటి నుంచి నిరసనల సంఖ్య పెరుగుతూనే ఉంది. జనసమీకరణ విషయంలో ప్రదర్శన నిర్వాహకులు అనుసరించిన వ్యూహం ఫలించింది. తమ నగరంపై చైనా ఏ విధంగా పెత్తనం చేస్తోందో ప్రదర్శకులు జనానికి సుబోధకం చేశారు. జనాన్ని చైతన్య పర్చడంలో హాంకాంగ్‌ ‌నిరసన ప్రదర్శనల నిర్వాహకులు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్‌ ఈ ‌మధ్య కాలంలో ప్రదర్శనల నగరంగా పేరొందింది. ప్రదర్శనకారులకు సకాలంలో సమాచారం అందించే నెట్‌ ‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనల నిర్వాహకులు సామాజిక మాధ్యమాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. జనాన్ని సమీకరించడంలోనే కాకుండా, ప్రదర్శకులకు సకాలంలో ఆదేశాలు అందేట్టు చర్యలు తీసుకోవడంలో, పనులు మానుకుని ప్రదర్శనలకు హాజరు అయ్యేట్టు చేయడంలో నిర్వాహకులు అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తోంది.
– ‘‌స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో

Tags: Chinese business tycoon, Hong Kong,ideal In Protests, it networks

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply